బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి ధోని అవుట్!

by సూర్య | Thu, Jan 16, 2020, 03:04 PM

 మహేంద్రసింగ్ ధోనిని బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్టు నుంచి తొలగించింది. వన్డే వరల్డ్‌కప్‌ ఓటమి అనంతరం ఈ జార్ఖండ్ డైనమైట్ మైదానంలో అడుగుపెట్టలేదు. దీంతో గ్రేడ్-ఎ కాంట్రాక్ట్‌లో ఉన్న ధోని కాంట్రాక్టును బీసీసీఐ రద్దు చేసింది. ఇప్పటికే ఈ జార్ఖండ్ డైనమైట్ కెరీర్‌పై తీవ్ర చర్చజరుగుతుండగా బీసీసీఐ తాజా నిర్ణయం అతని రీ ఎంట్రీపై సందేహాలను రేకిత్తిస్తోంది. 2014 డిసెంబర్‌‌లో టెస్ట్ క్రికెట్‌కు గుడ్‌పై చెప్పిన ధోని అనంతరం పరిమిత ఓవర్లలో 90 మ్యాచ్‌లు ఆడాడు. ఈ ఏడాది ఆస్ట్రేలియా వేదికగా జరుగనున్న టీ20 వరల్డ్‌కప్‌కు ధోని అందుబాటులో ఉంటాడని భావించిన అతని అభిమానులకు బీసీసీఐ తాజా నిర్ణయం మింగుడుపడటం లేదు. ఐపీఎల్‌తో తమ అభిమాన క్రికెటర్ రీ ఎంట్రీ ఇస్తాడని వారంతా భావించారు. కోచ్ రవిశాస్త్రి, మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ సైతం ధోని ఐపీఎల్ ఫామ్ అతని భవిష్యత్తుని నిర్ణయిస్తుందన్నారు.

Latest News

 
అందుక‌నే బయటకు వచ్చేశా: అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 12:08 PM
ఆ ఫైలు మీద‌నే తొలి సంతకం: నారా లోకేశ్ Sun, Apr 28, 2024, 12:07 PM
ఆడారిని గెలిపించి అభివృద్ధికి బాటలు వేయండి Sun, Apr 28, 2024, 12:06 PM
దక్షిణలో ఫ్యాన్ గాలులు: వాసుప‌ల్లి Sun, Apr 28, 2024, 12:06 PM
పిఠాపురంలో రెండు రోజులు పవన్ పర్యటన Sun, Apr 28, 2024, 10:22 AM