15మంది ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ షాక్

by సూర్య | Tue, Jan 14, 2020, 08:02 PM

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు ఆప్ తన ఆభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. రానున్న ఎన్నికల్లో పోటీచేయబోయే ఆభ్యర్థులను సీఎం కేజ్రీవాల్ ప్రకటించారు. కేజ్రీవాల్ ప్రకటించిన జాబితాలో 15 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు మొండిచేయి చూపారు. న్యూఢిల్లీ స్థానం నుంచి ఆప్ అధ్యక్షుడు, సీఎం కేజ్రీవాల్ పోటీ చేయనున్నారు. ఇక ఉప ముఖ్యమంత్రి మనిష్ షిసోడియా పట్పర్ గంజ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు. 70స్థానాలున్న ఢిల్లీ అసెంబ్లీకి ఫిబ్రవరి 8న ఎన్నికలు జరగనున్నాయి. మినిఇండియాగా పేరుగాంచిన ఢిల్లీలో ఈ సారి రసవత్తర పోరు జరగనుంది. గత ఎన్నికల్లో 70 స్థానాలకు గాను కేజ్రీవాల్ సారధ్యంలోని ఆప్ పార్టీ 67స్ధానాలను గెలుచుకుంది. బీజేపీ కేవలం మూడు స్థానాలకే పరిమితమైంది. ఢిల్లీని దశాబ్దం కాలం పాటు ఏకచత్రాధిపత్యంతో పాలించిన కాంగ్రెస్ కు ఒక్క సీటు కూడ రాలేదు.

Latest News

 
ఓవైపు కూతురు.. మరోవైపు కొడుకు పోటీ.. మధ్యలో వైసీపీ లీడర్ Mon, Apr 29, 2024, 07:44 PM
వైసీపీలోకి పిఠాపురం వర్మ?.. క్లారిటీ వచ్చేసిందిగా Mon, Apr 29, 2024, 07:39 PM
ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్: భూ వివాదాలు లేకుండా చేస్తారా..? అసలు భూమే లేకుండా చేస్తారా Mon, Apr 29, 2024, 07:35 PM
నామినేషన్ ఉపసంహరణ గడువు పూర్తి.. ఆ స్థానాల్లో టీడీపీకి తప్పని తలనొప్పి Mon, Apr 29, 2024, 07:31 PM
ఏపీ ఎన్నికల్లో టీడీపీ కూటమికి షాక్.. జనసేన గుర్తుతో కొత్త తలనొప్పి Mon, Apr 29, 2024, 07:27 PM