బీజేపీ, జనసేన కీలక భేటీ.. పొత్తు ఖాయమైనట్లేనా..?

by సూర్య | Tue, Jan 14, 2020, 08:05 PM

ఏపీలో రాజకీయ పరిణామాలు మారుతున్నాయి. 2014లో పవన్ కళ్యాణ్ బీజేపీ, టీడీపీలతో కలసి పనిచేశారు. 2019లో జనసేన ఓంటరిగానే ఎన్నికల బరిలోకి దిగింది. మళ్లీ తాజాగా బీజేపీ, జనసేనలు కలిసి పనిచేసేందుకు సిద్దమయ్యాయి. ఈ నెల 16న విజయవాడలోని గేట్ వే హోటల్లో ఉదయం 11 గంటలకు బీజేపీ, జనసేన నేతల కీలక భేటీ జరగబోతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బీజేపీ అగ్రనేతల భేటీ తర్వాత తొలిసారిగా రాష్ట్ర కమలనాథులతో సమావేశం కాబోతున్నారు.


ఇప్పటికే బీజేపీ, జనసేనలు కలసి పనిచేస్తాయని ప్రచార నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ సమావేశంలో ఇరు పార్టీలు కలసి పనిచేసే అంశంపైనే ప్రధానంగా చర్చ జరగనుంది. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడ బీజేపీ, జనసేనలు కలిసే పోటీ చేయాలని ఈ భేటీలో నిర్ణయం తీసుకోవచ్చని పవన్ సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. గత కొంతకాలంగా పవన్ కళ్యాణ్ బీజేపీకి అనుకూలంగా మాట్లాడుతున్నారు. వైసీపీని ఎదుర్కోవాలంటే బీజేపీ సహాకారం అవసరమని జనసేనాని భావిస్తున్నారట. దీంతో బీజేపీతో పొత్తుకు పవన్ మొగ్గుచూపారని తెలుస్తోంది.

Latest News

 
ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డిపై ఈసీ సస్పెన్షన్ వేటు Thu, Apr 18, 2024, 10:33 PM
మంగళగిరిలో విజయంతో కలిసి చరిత్రను లిఖిస్తాం : నారా లోకేశ్ Thu, Apr 18, 2024, 10:20 PM
ఏపీ ప్రజలకు శుభవార్త.. విజయవాడ నుంచి మరో కొత్త విమాన సర్వీసు ప్రారంభం Thu, Apr 18, 2024, 09:08 PM
ఉత్తరాంధ్రవాసులకు శుభవార్త.. బ్యాంకాక్‌కు నేరుగా విమానం, వివరాలివే Thu, Apr 18, 2024, 09:04 PM
ఏపీవాసులకు ఐర్‌సీటీసీ గుడ్ న్యూస్.. ఇక తక్కువ ధరలోనే షిరిడీ టూర్ Thu, Apr 18, 2024, 09:00 PM