ఐదు రోజుల్లో 5వేల ఒంటెలను చంపేశారు

by సూర్య | Tue, Jan 14, 2020, 07:47 PM

ఆస్ట్రేలియాలో చెలరేగిన కార్చిచ్చుకు 27 మంది ప్రాణాలు పోవడమే కాకుండా వేలాది జంతువులు చనిపోయాయి. కార్చిచ్చు వల్ల భారీగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించింది. పలు ప్రాంతాల్లో విపరీతమైన కరువు పరిస్థితులు ఏర్పడ్డాయి. కొన్ని ప్రాంతాల్లో నీటి కొరత కారణంగా ఒంటెలను చంపేయాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో 5 రోజుల్లో 5 వేల ఒంటెలను అక్కడి అధికారులు చంపేశారు. ఆస్ట్రేలియా దక్షిణ భాగంలో తీవ్ర కరువు ఏర్పడటంతో ఒంటెలు నీటి వనరులున్న ప్రాంతాలకు వెళ్లడం ప్రారంభించాయి. ఇప్పటికే కరువుతో అల్లాడుతున్న అస్ట్రేలియా ప్రజలకు ఒంటెల మందలు నీటిని తాగుతుండటంతో నీరు లేక అల్లాడిపోతున్నారు. ఒంటెలు నీటిని బాగా తాగి నిల్వ చేసుకుంటాయి. దీంతో ప్రభుత్వం 10 వేల ఒంటెలను కాల్చివేయాలని ఆదేశాలు ఇచ్చింది.

Latest News

 
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం Mon, Apr 29, 2024, 01:45 PM
వైసిపి పాలనలో పేద ప్రజలు దగా పడ్డారు.. కోండ్రు మురళీ Mon, Apr 29, 2024, 01:41 PM
వైసీపీలో చేరిన జువారి రమణారెడ్డి Mon, Apr 29, 2024, 01:38 PM
వైసీపీ మేనిఫెస్టోపై బీటెక్ రవి కీలక వ్యాఖ్యలు Mon, Apr 29, 2024, 01:36 PM
టిడిపిలో చేరిన వైసీపీ యువకులు Mon, Apr 29, 2024, 01:34 PM