ఈసారి రోహిత్‌ శర్మ 10 పరుగులకే అవుట్ !

by సూర్య | Tue, Jan 14, 2020, 02:58 PM

వాంఖేడే స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి వన్డేలో టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మ విఫలమయ్యాడు. రోహిత్‌ శర్మ 10 పరుగులకే చేసి తొలి వికెట్‌గా పెవిలియన్‌ చేరాడు. స్టార్ట్‌ వేసిన ఐదో ఓవర్‌ మూడో బంతిని మిడాఫ్‌ మీదుగా ఆడటానికి రోహిత్‌ యత్నించాడు. కాగా, అక్కడ ఫీల్డింగ్‌ చేస్తున్న డేవిడ్‌ వార్నర్‌ చివరి నిమిషంలో క్యాచ్‌ అందుకోవడంతో రోహిత్‌ ఇన్నింగ్స్‌ ముగిసింది. దాంతో 13 పరుగులకే టీమిండియా వికెట్‌ను కోల్పోయింది. కాగా, ఒక క్యాలెండర్‌ ఇయర్‌లో చివరి మూడు సందర్భాల్లో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో సెంచరీలు సాధించిన రోహిత్‌..ఈసారి మాత్రం ఫెయిల్‌ అయ్యాడు. 2019లో సిడ్నీ క్రికెట్‌ గ్రౌండ్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌ 133 పరుగులు సాధించగా, అంతకుముందు 2016లో వాకాలో అదే జట్టుతో జరిగిన తొలి వన్డేలో 171 పరుగులు చేశాడు. 2015లో ఎంసీజీలో ఆసీస్‌తో జరిగిన మొదటి వన్డేలో రోహిత్‌ 138 పరుగులు సాధించాడు. కానీ ఈ క్యాలెండర్‌ ఇయర్‌లో ఆసీస్‌తో జరిగిన తొలి వన్డేలో రోహిత్‌ రెండంకెల స్కోరుకే పరిమితమయ్యాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచిన ఆసీస్‌ ముందుగా ఫీల్డింగ్‌ తీసుకుంది. దాంతో భారత బ్యాటింగ్‌ను రోహిత్‌-శిఖర్‌ ధావన్‌లు ఆరంభించారు. కాగా, రోహిత్‌ శర్మ రెండు ఫోర్లు కొట్టి మంచి టచ్‌లో కనిపించినా ఎక్కువ సేపు క్రీజ్‌లో నిలవలేదు. మిచెల్‌ స్టార్క్‌ వేసిన అద్భుతమైన బంతికి కాస్త తడబడ్డ

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM