టీ20 ప్రపంచకప్‌లో కొత్తగా 4 టీమ్స్‌కు అవకాశం!

by సూర్య | Tue, Jan 14, 2020, 02:45 PM

 ఐసీసీ నాలుగు రోజుల టెస్టు ప్రతిపాదన తీసుకొచ్చిన విషయం తెలిసిందే. తాజాగా మరో మరో కొత్త ఆలోచనతో ముందుకువచ్చింది. టీ20 ప్రపంచకప్‌లో తలపడే జట్ల సంఖ్యను ఐసీసీ పెంచాలని భావిస్తోంది. ప్రస్తుతం 16 జట్లతో మెలగ టోర్నీని నిర్వహిస్తుండగా.. మరో నాలుగింటికి అవకాశం ఇవ్వనున్నట్టు సమాచారం తెలుస్తోంది. 2023-31 మధ్య జరిగే టీ20 ప్రపంచకప్‌లను 20 జట్లతో నిర్వహించాలనుకొంటోంది. 2024 టీ20 ప్రపంచకప్‌లో 20 జట్లు బరిలోకి దిగొచ్చని సమాచారం. ప్రస్తుతం ఈ ఫార్మాట్‌పై ప్రపంచ వ్యాప్తంగా అభిమానుల్లో విపరీతమైన క్రేజ్‌ ఉన్న విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్‌ మ్యాచ్‌లు జరిగిన సమయంలో స్టేడియాలు అన్ని నిండాయి. ఈ క్రేజ్ కారణంగా.. ఫుట్‌బాల్‌, బాస్కెట్‌బాల్‌ తర హాలో ఎక్కువ జట్లను ఆడించాలని ఐసీసీ భావిస్తోంది. 20 జట్లతో నిర్వహించే మెగా టోర్నీని రెండు విధాలుగా నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. నాలుగు గ్రూపుల్లో ఐదేసి జట్లను చేర్చి టాప్‌లో నిలిచిన వాటిని నాకౌట్‌లో ఆడించొచ్చు. లేదంటే ప్రస్తుతం కొనసాగిస్తున్న రెండంచెల పద్దతి ద్వారా క్వాలిఫై టోర్నీలతో చిన్న జట్లను ప్రపంచకప్‌నకు అర్హత కల్పించొచ్చు. మరి ఐసీసీ ఈ రెండు విధానాల్లో దేనికి ఓటేస్తుందో చూడాలి. 2007లో తొలిసారి జరిగిన టీ20 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకుంది. అనంతరం పాకిస్థాన్ (2009), ఇంగ్లండ్ (2010), వెస్టిండీస్ (2012), శ్రీలంక (2014), వెస్టిండీస్ (2016)లు మెగా టోర్నీని గెలుచుకున్నాయి. విండీస్ రెండుసార్లు విజేతగా నిలిచింది. కివీస్, ఆసీస్, బంగ్లాలు ఇంకా పొట్టి కప్ అందుకోలేదు. మరో ఆరు నెలల్లో ఆస్ట్రేలియా గడ్డపై టీ20 ప్రపంచకప్‌ జరగనున్న విషయం తెలిసిందే. ఇప్పటినుండే ఈ మెగా సమరం కోసం అన్ని జట్లు సిద్ధమవుతున్నాయి.

Latest News

 
ఏపీ సీనియర్ ఏబీ వెంకటేశ్వరరావుకు మరో టెన్షన్.. మరో 2 వారాలే, కష్టమేనా Sat, May 18, 2024, 10:21 PM
తెలుగుదేశం ఆఫీసులో వైఎస్ జగన్ ఎయిర్‌పోర్ట్ ఘటన డాక్టర్.. సంచలన ఆరోపణలు Sat, May 18, 2024, 10:16 PM
సీఎం జగన్ లండన్ వెళ్లే సమయంలో కలకలం.. ఎయిర్‌పోర్టులో అనుమానాస్పద వ్యక్తి Sat, May 18, 2024, 09:01 PM
తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు.. కోర్టుకెళ్లి మరీ సాధించుకున్న ఇద్దరు భక్తులు Sat, May 18, 2024, 09:00 PM
లండన్ పర్యటకు వెళ్లిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ Sat, May 18, 2024, 08:52 PM