నిర్భయ దోషులకు మరింత కట్టుదిట్ట భద్రత

by సూర్య | Tue, Jan 14, 2020, 01:43 PM

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22వతేదీన ఉరి తీయనున్న నేపథ్యంలో వారిని హై సెక్యూరిటీ జైలు గదులకు తరలించారు. 24గంటల పాటు ముగ్గురు జైలు గార్డుల పర్యవేక్షణలో నిర్భయ దోషులైన పవన్‌గుప్తా, అక్షరు, వినరు శర్మ, ముకేశ్‌ సింగ్‌లను జైలు గదుల్లో ఉంచారు. సాధారణంగా ఇతర ఖైదీల మాదిరిగా నిర్భయ దోషులు వారానికి రెండు సార్లు వారివారి కుటుంబ సభ్యులను కలవవచ్చు అనేది జైలు నిబంధన. కానీ నిర్భయ దోషులకు కోర్టు డెత్‌ వారంట్‌ జారీ చేసిన దృష్ట్యా వారు చివరిసారిగా కుటుంబసభ్యులను కలిసేందుకు తిహార్‌ జైలు అధికారులు అనుమతించ నున్నారు. జైల్లో నిర్భయ కేసులో నలుగురు దోషులు మామూలుగానే ప్రవర్తిస్తున్నారని తెలుస్తోంది. బహుశా ఉరి శిక్ష ఆగిపోతుందని నిర్భయ దోషులు భావిస్తున్నారని, దోషుల వ్యవహారశైలి గురించి తెలుస్తోంది. ఉరిశిక్ష తేదీకి ముందే ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రంలోని విూరట్‌ సెంట్రల్‌ జైలు తలారీ పవన్‌ కుమార్‌ తిహార్‌ జైలును సందర్శించి ఉరి ఏర్పాట్లను పరిశీలించనున్నారు.


 


 

Latest News

 
ప్రభాస్ మద్దతు ఆ పార్టీకే.. ప్రచారం కూడా చేస్తున్న కృష్ణంరాజు సతీమణి Wed, May 08, 2024, 10:16 PM
ఒంటరిగా కారులో మహిళ.. 5 నిమిషాల్లోనే పని ముగించిన ఇద్దరు దుండగులు Wed, May 08, 2024, 09:05 PM
ఏపీలో మరికొందరు పోలీసులపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Wed, May 08, 2024, 09:00 PM
చిత్తూరు జిల్లా కుప్పంలో ఆసక్తికర సన్నివేశం,,,పోస్టల్ బ్యాలట్ ఓటర్ల కాళ్లపై పడ్డ వైసీపీ నేతలు Wed, May 08, 2024, 08:56 PM
గద్దె రామ్మోహన్‌రావుపై సంచలన ఆరోపణలు..ఎన్నికలకు ముందు కుట్ర Wed, May 08, 2024, 08:52 PM