ఐఆర్‌సీటీసీ నుంచి అరకు స్పెషల్ ప్యాకేజీ

by సూర్య | Tue, Jan 14, 2020, 01:06 PM

చలికాలంలో అరకు అందాలు చూసేందుకు వెళ్లాలనుకుంటున్నారా? ఓ రెండు రోజులు ప్రశాంతంగా గడపాలనుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త. అరకు వెళ్లాలనుకునేవారికి అరకు టూర్ ప్యాకేజీ అందిస్తోంది ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC. విశాఖపట్నం నుంచి ఈ టూర్ మొదలవుతుంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.6,215, డబుల్ ఆక్యుపెన్సీ రూ.8,580, సింగిల్ ఆక్యుపెన్సీ రూ.15.665. విశాఖపట్నంలో పికప్, డ్రాప్, రెండు రాత్రులు విశాఖపట్నంలో బస, బ్రేక్‌ఫాస్ట్, డిన్నర్, ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ లాంటివి ఈ ప్యాకేజీలో కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న టూరిస్టులను విశాఖపట్నంలోని పర్యాటక ప్రాంతాలతో పాటు, అరకు తీసుకెళ్తారు. ఈ ప్యాకేజీ 2020 జనవరి 1న ప్రారంభమైంది. 2020 మార్చి 29 వరకు అరకు టూర్ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది.


ఐఆర్‌సీటీసీ వైజాగ్ అరకు టూర్ ప్యాకేజీ ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. మొదటి రోజు విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌లో టూరిస్టులను పికప్ చేసుకుంటారు. హోటల్‌లో చెక్ ఇన్ అయిన తర్వాత తొట్లకొండ బుద్ధిస్ట్ కాంప్లెక్స్, కైలాసగిరి, రుషికొండ బీచ్, రామానాయుడు ఫిలిమ్ స్టూడియో, సబ్‌మెరైన్ మ్యూజియం, ఫిషింగ్ హార్బర్ ప్రాంతాలకు తీసుకెళ్తారు. రాత్రికి విశాఖపట్నంలో బస చేయాలి. రెండో రోజు ఉదయం అరకు బయల్దేరాలి. పద్మాపురం గార్డెన్స్, ట్రైబల్ మ్యూజియం, అనంతగిరి కాఫీ ప్లాంటేషన్, గాలికొండ వ్యూపాయింట్, బొర్రా గుహలు చూసిన తర్వాత సాయంత్రం విశాఖకు తిరిగి రావాలి. రాత్రికి విశాఖలోనే బస చేయాలి. మూడో రోజు ఉదయం బ్రేక్‌ఫాస్ట్ తర్వాత విశాఖపట్నం ఎయిర్‌పోర్ట్, రైల్వే స్టేషన్, బస్‌స్టాండ్‌లో డ్రాప్ చేస్తారు. దీంతో టూర్ ముగుస్తుంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM