సీఏఏ పై సుప్రీంకోర్టుకు

by సూర్య | Tue, Jan 14, 2020, 12:19 PM

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన పౌరసత్వ సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా ఆందోళనలు వ్యక్తమవుతూనే ఉన్నాయి... దాదాపు 13 రాష్ట్రాల్లో ఈ చట్టాన్ని అమలు చేసేది లేదని కేంద్రానికి  స్పష్టం  చేశాయ. ఇప్పటికే పౌరసత్వ సవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసిన కేరళ ప్రభుత్వం... ఇప్పుడు మరో కీలక అడుగు వేసింది.. సీఏఏకు వ్యతిరేకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించింది కేరళ ప్రభుత్వం. పౌరసత్వ సవరణ చట్టం 2019ను సవాలు చేస్తూ కేరళ రాష్ట్రం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.. దేశ లౌకికత్వాన్ని దెబ్బతీసేలా చట్టం ఉందని తన పిటిషన్‌లో పేర్కొంది కేరళ సర్కార్.. తద్వారా కేంద్ర ప్రభుత్వం చేసిన వివాదాస్పద చట్టాన్ని సవాలు చేసిన మొదటి రాష్ట్రంగా అవతరించింది.


వివాదాస్పద పౌరసత్వం (సవరణ) చట్టం లేదా సీఏఏను మంగళవారం సుప్రీంకోర్టులో సవాల్ చేసింది కేరళ... భారత ప్రభుత్వం.. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాల మధ్య వివాదాలను విచారించడానికి సుప్రీంకోర్టుకు అధికారం ఇచ్చే రాజ్యాంగంలోని ఆర్టికల్ 131 ప్రకారం ఈ పిటిషన్ దాఖలు చేసింది. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 ప్రకారం సమానత్వ హక్కును, ఆర్టికల్ 21 కింద జీవించే హక్కును, ఆర్టికల్ 25 కింద మతాన్ని ఆచరించే స్వేచ్ఛను సీఏఐ ఉల్లంఘిస్తోందని పిటిషన్‌లో పేర్కొంది. సీఏఏ వివక్షపూరితమైనదని వాదిస్తోంది.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM