చంద్రబాబు పై ఆరోపణలు చేసిన ముద్రగడ

by సూర్య | Mon, Jan 13, 2020, 07:00 PM

కాపు ఉద్యమం జరిగిన సమయంలో చంద్రబాబు తన కుటుంబాన్ని దారుణంగా లాఠీలతో కొట్టించారని కాపు ఉద్యమనేత ముద్రగడ పద్మనాభం ఆరోపించారు. చంద్రబాబు తన సామాజిక వర్గం మహిళలపై దాడి జరగ్గానే ప్రజాస్వామ్యం గురించి  మాట్లాడుతున్నారని, నాడు నా భార్య, కొడుకు, కోడలిపై దాడి జరిగినప్పుడు ప్రజాస్వామ్యం గుర్తుకురాలేదా అంటూ నిలదీశారు. ఈ మేరకు చంద్రబాబుకు బహిరంగ లేఖ రాశారు. పోలీసు వ్యవస్థను భ్రష్టు పట్టించింది మీరు కాదా? అంటూ మండిపడ్డారు.


కాపు ఉద్యమాన్ని చూపించొద్దని మీడియాను కూడా ఆదేశించారని, మాకు జరిగిన అవమానం గురించి వెల్లడించుకుండా మీడియాను కట్టడి చేయాలని ఏ చట్టం చెప్పిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మీ రాక్షస పాలన నుంచి తొలుత తెలంగాణ విముక్తురాలైందని, ఆ తర్వాత ఏపీ ప్రజలు స్వేచ్ఛ పొంది అదృష్టవంతులయ్యారని ముద్రగడ పేర్కొన్నారు. నాడు చందాలతో ఉద్యమం చేస్తున్నానని నాపై అభాండాలు వేశారు, ఇప్పుడు మీరు జోలె పట్టి అడుక్కుంటున్నారు, సిగ్గుగా లేదూ? అంటూ నిలదీశారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM