సోనియాగాంధీకి షాకిచ్చిన విపక్షాలు

by సూర్య | Mon, Jan 13, 2020, 07:15 PM

సీఏఏతో పాటు ఎన్ఆర్సీపై అఖిలపక్ష సమావేశం నిర్వహిస్తోన్న కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీకి విపక్ష పార్టీలు షాకిచ్చాయి. ఈ సమావేశానికి హాజరయ్యేది లేదని పలు పార్టీల అధినేతలు స్పష్టం చేశారు. మమతా బెనర్జీతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, మాయవతి, శివసేనలు ఈ సమావేశానికి గైర్హాజయ్యారు. కాంగ్రెస్ నిర్వహించే అఖిలపక్ష సమావేశానికి తాము హాజరుకావడం లేదని నేతలు మొండిచేయి చూపారు. అయితే కీలక సమావేశానికి ప్రధాన పార్టీలు గైర్హాజరుపై సోనియాగాంధీ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఈ అఖిలపక్ష సమావేశానికి కేవలం ఎన్సీపీ, ఆర్జేడీ, వామపక్షాలు, డీఎంకే, ఎస్పీ నేతలు మాత్రమే హాజరయ్యారు. మహరాష్ట్రలో సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వామి శివసేన చివరి నిమిషంలో సమావేశానికి హాజరుకాకపోవడం కాంగ్రెస్ వర్గాలకు మింగుడు పడటం లేదు.

Latest News

 
ఎన్డీఏ కూటమి ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల గెలుపుకు కృషి చేయండి Thu, May 02, 2024, 03:57 PM
ప్రజాగళం ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేసిన బి. కె. పార్థసారథి Thu, May 02, 2024, 03:55 PM
తిరుపతి- కదిరిదేవరపల్లికి వెళ్లే రైలు మూడు నెలలు రద్దు Thu, May 02, 2024, 03:50 PM
శ్రీశైల క్షేత్రం పరిధిలో అమల్లోకి పూర్తిస్థాయి ప్లాస్టిక్ నిషేధం Thu, May 02, 2024, 03:04 PM
కలిశాలకు ప్రత్యేక పూజలు Thu, May 02, 2024, 01:59 PM