ఇసుక బస్తాలతో డమ్మీ ఉరికి సన్నాహాలు

by సూర్య | Mon, Jan 13, 2020, 03:40 PM

నిర్భయ కేసులో నలుగురు దోషులకు ఈ నెల 22న ఉరి తీసేందుకు డెత్‌ వారెంట్‌ జారీ అయిన నేపథ్యంలో ముందుగా ఇసుక బస్తాలతో డమ్మీ ఉరి తీసేందుకు తీహార్‌ జైలు అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మేరకు జైలు అధికారులు తెలిపారు. దోషులు పవన్‌గుప్తా, అక్షయ్‌, వినయ్‌ శర్మ, ముకేశ్‌ సింగ్‌ల బరువు ఆధారంగా ఇసుక సంచులను సిద్ధం చేసినట్టు తెలిపారు. దోషుల బరువుకు సమానమైన బరువున్న ఇసుక బస్తాలను ఆ తాళ్లకు కట్టి 1.8 మీటర్ల నుంచి 2.4 మీటర్ల ఎత్తులో వేలాడదీస్తారు.


ఉరి కంబాల పటిష్టతను పరిశీలించడం కోసం ఇలా డమ్మీ ఉరి శిక్షను అమలు చేస్తారు. ఇందులో తాళ్లలో కానీ, ఉరికొయ్యలో కానీ ఏవైనా లోపాలుంటే బయటపడే అవకాశముంటుంది. తీహార్ ప్రాంగణంలోని మూడో నెంబరు జైల్లో ఈ ట్రయల్స్ నిర్వహించనున్నారు. నలుగురు దోషులకు ఏకకాలంలో ఉరి తీసేలా జైలులోని 3వ నంబరు గదిలో ఉరి ప్రాంగణాన్ని విస్తరించారు. ప్రస్తుతం దోషులు నలుగురినీ వేర్వేరు గదుల్లో ఉంచి ఒకరితో ఒకరు కలవకుండా చర్యలు చేపట్టారు.

Latest News

 
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 03:24 PM
దువ్వూరు మండలంలో పలువురు వైసీపీలో చేరిక Fri, May 03, 2024, 03:20 PM
కారు బైక్ ఢీ వ్యక్తి మృతి Fri, May 03, 2024, 03:18 PM
షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు Fri, May 03, 2024, 02:50 PM
మోసపూరిత మాటలు నమ్మవద్దు: ఎమ్మెల్యే అభ్యర్థి వెనిగండ్ల రాము Fri, May 03, 2024, 02:46 PM