ఈనెల 17న నింగిలోకి జీశాట్‌-30 ఉప‌గ్ర‌హం

by సూర్య | Mon, Jan 13, 2020, 01:54 PM

ఇస్రో రూపొందించిన జీశాట్‌-30 ఉప‌గ్ర‌హాన్ని ఈనెల 17వ తేదీన ప్ర‌యోగించ‌నున్నారు. ఏరియేన్‌-5 రాకెట్ ద్వారా దీన్ని నింగిలోకి పంపుతారు. ఫ్రెంచ్ గ‌యానాలోని కౌరు అంత‌రిక్ష కేంద్రం నుంచి ఈ ప్ర‌యోగం జ‌ర‌గ‌నున్న‌ది. జీశాట్‌-30ని క‌మ్యూనికేష‌న్ శాటిలైట్‌గా త‌యారు చేశారు. జియో స్టేష‌న‌రీ ఆర్బిట్ నుంచి సీ, కేయూ బ్యాండ్ల‌లో క‌మ్యూనికేష‌న్ సేవ‌ల‌ను అందిస్తుంది. జీశాట్ బ‌రువు సుమారు 3357కిలోలు. ఐ-3కే ప్లాట్‌ఫామ్‌లో దీన్ని త‌యారు చేశారు. ఇన్‌శాట్‌-4ఏకు ప్ర‌త్యామ్నాయంగా జీశాట్‌-30 ప‌నిచేయ‌నున్న‌ది. భార‌త్‌తో పాటు అనుబంధ దేశాల‌కు ఈ శాటిలైట్ ద్వారా కేయూ బ్యాండ్‌లో సిగ్న‌ల్ అందిస్తారు. గ‌ల్ఫ్ దేశాల‌కు సీ బ్యాండ్ ద్వారా క‌వ‌రేజ్ ఇవ్వ‌నున్నారు. ఆసియాలో కొన్ని దేశాల‌తో పాటు ఆస్ట్రేలియాకు కూడా సీ బ్యాండ్ ద్వారా సేవ‌లు అందిస్తారు. భార‌త కాల‌మానం ప్ర‌కారం ఈనెల 17వ తేదీన 2.35 నిమిషాల‌కు ఈ శాటిలైట్‌ను నింగిలోకి పంపిస్తారు.

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM