మరోసారి 17న భేటీ కానున్న హైపవర్ కమిటీ

by సూర్య | Mon, Jan 13, 2020, 01:25 PM

రాజధాని అంశంపై చర్చించి నిర్ణయం తీసుకునేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన హైపవర్ కమిటీ ముచ్చటగా మూడోసారి సమావేశమైనా ఏమీ తేల్చకుండానే ముగించింది. సంక్రాంతి అనంతరం ఈ నెల 17న మరోసారి సమావేశమవ్వాలని నిర్ణయించింది. విజయవాడలోని ఆర్టీసీ సమావేశ మందిరంలో భేటీ అనంతరం మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ రైతులు ఏమైనా చెప్పదల్చుకుంటే వారి నుంచి లిఖిత పూర్వకంగా తీసుకోవాలని నిర్ణయిం చినట్లు తెలిపారు. తమ విజ్ఞాపనలను రైతులు నేరుగా సీఆర్డీఏ కమిషనర్ కు  అందించినా పర్వాలేదని, ఆన్ లైన్లో ఇచ్చినా సరిపోతుందని తెలిపారు. కాగా, ఈ భేటీలో రాజధాని అంశంపై ప్రభుత్వం చేసిన ప్రతిపాదనలపై కమిటీ చర్చించింది. ఇంతకు ముందు జరిగిన రెండు సమావేశాల్లో రైతుల ఆందోళన, సచివాలయం ఉద్యోగుల డిమాండ్ల పై చర్చించారు.

Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM