పోరాడితే మహిళల పాస్ పోర్ట్ రద్దు చేయిస్తారా : లోకేష్

by సూర్య | Mon, Jan 13, 2020, 01:27 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్‌పై టీడీపీ నేత నారా లోకేశ్ విమర్శలు గుప్పించారు. 'తుగ్లక్ నిర్ణయాలకు వ్యతిరేకంగా పోరాడితే మహిళల పాస్ పోర్ట్ రద్దు చేయిస్తారా? మరీ అంత దిగజారిపోయారా జగన్ గారు? 500 మంది మహిళల మీద కేసులా? 12 సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తారా?' అని విమర్శలు గుప్పించారు.


'శాంతియుతంగా మీరు ఇచ్చిన హామీ నిలబెట్టుకోమని నిలదీసినందుకు మహిళల వివరాలు పాస్ పోర్ట్ కార్యాలయానికి పంపించడం మీ భయానికి నిదర్శనం. మహిళలపై కక్ష సాధింపు మంచింది కాదు జగన్ గారు' అని లోకేశ్ ట్వీట్ చేశారు.


'తప్పు చేసి మీరు ప్రతి శుక్రవారం కోర్టుకి వెళ్తున్నారు. ఎన్నో కేసుల్లో నిందితుడిగా ఉన్న మీరు స్వేచ్ఛగా ప్రపంచమంతా తిరుగుతున్నారు. మహిళలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా ఉండదా?' అని లోకేశ్ ప్రశ్నించారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM