బీసీసీఐ సీజన్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకున్న 'యప్‌ టీవీ'

by సూర్య | Sun, Jan 12, 2020, 06:59 PM

 ప్రముఖ ఓటీటీ ఫ్లాట్‌ఫాం 'యప్‌ టీవీ' బీసీసీఐ హోం సీజన్‌ డిజిటల్‌ ప్రసార హక్కులను సొంతం చేసుకుంది. ఇకనుంచి ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లోని యప్‌టీవీ యూజర్లు తమ ఫేవరెట్‌ క్రికెట్‌ మ్యాచ్‌లను ఈ ఫ్లాట్‌ఫాంపై ప్రత్యక్షంగా చూసి ఆనందించొచ్చు. ఈ హోమ్‌ సీజన్‌లో శ్రీలంక, ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికా, భారత్‌లు తలపడే మ్యాచ్‌లను క్రీడాభిమానులు లైవ్‌లో వీక్షించొచ్చు. కాంటినెంటల్‌ యూరప్‌, సెంట్రల్‌ ఏసియా, భారత్‌ను మినహాయించి సార్క్‌ దేశాల్లో, మిడిల్‌ ఈస్ట్‌, నార్త్‌ అమెరికాలోని అభిమానులు యప్‌ టీవీ ద్వారా క్రికెట్‌ను ఆస్వాదించొచ్చు. బీసీసీఐ హోమ్‌ సీజన్‌ హక్కులు కైవసం చేసుకోవడంపై 'యప్‌ టీవీ' ఫౌండర్‌, సీఈవో ఉదయ్‌ రెడ్డి ఆనందం వ్యక్తం చేశారు. స్పోర్ట్స్‌ ఈవెంట్‌ను తమ యూజర్లు లైవ్‌లో యాక్సెస్‌ చేసుకునేందుకు తాము బీసీసీఐ హోం సీజన్‌ డిజిటల్‌ హక్కులను కైవసం చేసుకున్నామని ఉదయ్‌ రెడ్డి పేర్కొన్నారు. ప్రపంచ వ్యాప్తంగా నివసిస్తున్న ప్రజలకు దక్షిణాసియా అత్యుత్తమంగా ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ కంటెంట్‌ అందించేందుకు ఎప్పటికీ ముందుంటాం అని సీఈవో తెలిపారు. ఈ సిరీస్‌ను ప్రపంచవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానులు యప్‌టీవీలో వీక్షించవచ్చు. యప్‌టీవీ.కాంను లాగ్‌ అవడం లేదా స్మార్ట్‌ టీవీల్లో యప్‌టీవీ యాప్‌ల ద్వారా వివిధ స్మార్ట్‌ ఫోన్లు, ట్యాబ్లెట్లు, ఇతర డివైజ్‌ల్లో ఆయా మ్యాచ్‌లను ఆస్వాదించవచ్చని యప్‌ టీవీ ఓ ప్రకటనలో తెలిపింది.

Latest News

 
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM
ఏపీలో మరో ఇద్దరు డీఎస్పీలపై ఎన్నికల సంఘం బదిలీ వేటు Sun, May 05, 2024, 08:34 PM
సీఎం జగన్‌కు మూడో లేఖ రాసిన షర్మిల.. తొమ్మిది ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ Sun, May 05, 2024, 08:29 PM