ఏపీలో మరో ఉద్యోగ నోటిఫికేషన్ విడుదల

by సూర్య | Sun, Jan 12, 2020, 04:41 PM

ఏపీలో నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం శుభవార్తలు చెబుతోంది. రెండ్రోజుల క్రితమే 16 వేలకు పైగా గ్రామ సచివాలయ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది. తాజాగా రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 246 వీఆర్వో పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పదో తరగతి లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు వీఆర్వో ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులుగా పేర్కోంది. ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తులు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఉభయ గోదావరి జిల్లాల్లో పోస్టులు లేకపోవడం నిరుద్యోగులకు నిరాశనే మిగిల్చింది.


పోస్టుల వివరాలు.. దరఖాస్తు.. అర్హతలు ఇలా....


- పోస్టులు- విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, ( గ్రేడ్ 2 )


- ఖాళీలు- 246


- దరఖాస్తుకు చివరి తేది- జనవరి 11 నుంచి 31 వ తేది వరకు.


- దరఖాస్తు ఫీజు- ఓసీ ఆభ్యర్ధులు రూ.200, పరీక్ష ఫీజు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగులు, ఎక్స్ సర్వీస్ మెన్ ఆభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 మాత్రమే.


- ఫీజు చెల్లింపుకు చివరి తేది- జనవరి 30.


- దరఖాస్తు చేసే విధానం- ఆన్‌లైన్.


- అర్హత- పదో తరగతి లేదా తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.


- వయో పరిమితి- జనవరి 1 2020 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్యలో ఉండాలి.


- ఎంపిక- రాతపరీక్ష, ఇంటర్వ్యూ


- జిల్లాల వారీగా ఖాళీలు...


- శ్రీకాకుళం- 19


- విజయనగరం- 74


- విశాఖ- 50


- కృష్ణా- 34


- గుంటూరు- 03


- ప్రకాశం- 02


- నెల్లూరు- 12


- చిత్తూరు- 26


- కడప- 04


- అనంతపురం- 13


- కర్నూల్- 09

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM