గాయపడ్డ శ్రీలక్ష్మీకి చంద్రబాబు పరామర్శ

by సూర్య | Sun, Jan 12, 2020, 05:05 PM

అమరావతి రాజధాని ఆందోళనల్లో గాయపడి చికిత్స పొందుతున్న శ్రీలక్ష్మీని టీడీపీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. శ్రీలక్ష్మీ తండ్రిని పోలీసులు తీసుకెళుతుండగా ఆమె అడ్డుకుంది. దీంతో జరిగిన తోపులాటలో ఆమె కిందపడిపోయింది. ఓ మహిళా కానిస్టేబుల్ శ్రీలక్ష్మిని బూటుకాలుతో తొక్కారు. ఈ ఘటనలో గాయపడిన శ్రీలక్ష్మీ విజయవాడలోని ఆయుష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతుంది. విషయం తెలుసుకున్న చంద్రబాబు నాయుడు ఆదివారం మధ్యాహ్నం ఆయుష్ ఆస్పత్రిలో ఆమెను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఆయన ఏమన్నారంటే..


“ఈ ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తుంది. బూటు కాలితో మహిళను తన్నారు. తొక్కారు. పోలీసులు తప్పు చేయవద్దు. పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరిస్తున్నారు. దౌర్జన్యంతో ప్రజా ఉద్యమాలను ఆపలేరు. పోలీసులు మొండిగా వ్యవహరించి దోషులు కావద్దు. ఇంత జరుగుతున్నా సీఎం స్పందించకపోవడం దారుణం. ప్రజా జీవితాన్ని అస్తవ్యస్తం చేస్తున్నారు. 144 సెక్షన్ ఎందుకు విధిస్తున్నారు. రైతులను, ఆందోళనకారుల పై లాఠీఛార్జీ చేస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను వైసీపీ సర్కార్ ఖూనీ చేస్తుంది.” అని చంద్రబాబు నాయుడు సర్కార్ పై విమర్శలు చేశారు.

Latest News

 
సాయి గౌతమ్ రెడ్డిని అభినందించిన ఎస్సై Tue, Apr 23, 2024, 04:22 PM
గ్రామ దేవతలకుమొక్కులు తీర్చుకున్న మహిళలు Tue, Apr 23, 2024, 04:20 PM
ఎస్సీ కాలనీకి చెందిన 50 మంది టీడీపీలోకి చేరిక Tue, Apr 23, 2024, 04:20 PM
కేశినేని నానికి ఆరు లగ్జరీ కార్లు Tue, Apr 23, 2024, 03:15 PM
చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: లత రెడ్డి Tue, Apr 23, 2024, 01:54 PM