పెట్టుబడులకు రాష్ట్ర ప్రతిష్ఠ కీలకం : మాజీ మంత్రి యనమల

by సూర్య | Sun, Jan 12, 2020, 01:44 PM

ఏ రాష్ట్రమైనా పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలన్నా, పెట్టుబడులు రావాలన్నా ఆ రాష్ట్ర ప్రతిష్ఠ ఎంతో కీలకమని, అదే పోతే రాష్ట్రం ముఖం చూసే పారిశ్రామికవేత్త ఉండరని టీడీపీ నాయకుడు, మాజీ ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు అన్నారు. కాకినాడలో ఈరోజు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తానని చెబుతున్న ముఖ్యమంత్రి వై.ఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి, అసలు పెట్టుబడులే రాకుంటే రాష్ట్రాన్ని ఎలా నడిపిస్తారని ప్రశ్నించారు. విశాఖను అభివృద్ధి చేస్తానని సీఎం చెబుతున్నారని, ప్రస్తుత ప్రభుత్వం తీరువల్లే విశాఖకు అన్యాయం జరిగిందన్నారు.  కేంద్ర ప్రభుత్వం అరకొరగా నిధులు ఇస్తోందని, అప్పులు ఇచ్చేవారు కూడా లేరన్నారు. పోలవరం ప్రాజెక్టు పనులు ఎందుకు నిలిపివేశారని ప్రశ్నించారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM