సీఎం జగన్ మరిన్ని సంచలన నిర్ణయాలు

by సూర్య | Sun, Jan 12, 2020, 01:50 PM

ఏపీలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం జగన్ సంచలన నిర్ణయాలతో ముందుకెళ్తున్నారు. ఇప్పటికే అనేక సంక్షేమ పథాకాలను జగన్ ప్రవేశపెట్టారు. తాజాగా ఏపీకి జీవనాడియైన పోలవరం ప్రాజెక్టుపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2021 నాటికి పోలవరం ద్వారా రైతులకు నీరందించే లక్ష్యంగా ముందుకెళ్తున్నారు. ముఖ్యమంత్రి జగన్ పోలవరం ప్రాజెక్టును అత్యంత ప్రాధాన్యత కలిగిన ప్రాజెక్టుగా పరిగణిస్తున్నారు. పోలవరం పనుల నిధులకు ఆటంకాలు లేకుండా రాష్ట్ర ప్రభుత్వం పయత్నాలు చేస్తోంది. బిల్లులను పెండింగ్ లో ఉంచకుండా ఎప్పటికప్పుడు చెల్లించాలని జగన్ డిసైడ్ అయ్యారు. పోలవరం పనుల్లో కాంట్రాక్టర్ల బిల్లులను 90 రోజుల్లోనే చెల్లించాలని నిర్ణయం తీసుకుంది.


ఇకపై బ్యాంకుల ద్వారా డిస్కౌంట్ విధానంలో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించనుంది. దీంతో రాష్ట్ర ఖజానాకు కూడ వెసులుబాటు కలుగుతుందని అధికారులు భావిస్తున్నారు. దాదాపు పోలవరం ప్రాజెక్టుకు నెలకు 1100 కోట్ల మేర బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయినా కూడ ప్రభుత్వం ఈ ప్రాజెక్టు పూర్తి కావాలని ముందుకెళ్తోంది. అందుకే బిల్ డిస్కౌంట్ విధానాన్ని తెరపైకి ప్రభుత్వం తీసుకువస్తోంది. విభజన చట్ట ప్రకారం పోలవరం ప్రాజెక్ట్ అయ్యే వ్యయాన్ని కేంద్రమే భరించాలి. అయితే ప్రాజెక్టు పనులకు రాష్ట్ర ప్రభుత్వం పెట్టే ఖర్చులను కేంద్రం రీ ఎంబయిర్స్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుత అంచనాల ప్రకారం 55 వేల కోట్ల రూపాయాలు పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చవుతుంది.


ఇదిలావుంటే మరో సంచలన నిర్ణయాన్ని ముఖ్యమంత్రి జగన్ తీసుకున్నారు. బీసీలోని కులాల్లో జనాభా ఆదారంగా మూడు బీసీ కార్పోరేషన్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. బీసీల్లో 10 వేల నుంచి లక్ష వరకు జనాభా ఉన్న కులాలను ఒక కేటగిరిగా పరిగణించి ఒక కార్పోరేషన్ ఏర్పాటు చేయనున్నారు. లక్ష నుంచి 10 లక్షల వరకు జనాభా ఉన్న బీసీ వర్గాలను రెండో కేటగిరి కింద మరో కార్పోరేషన్ ఏర్పాటు చేస్తారు. ఇక 10 లక్షల నుంచి ఆ పైన జనాభా ఉన్న బీసీలను మూడో కేటగిరిగా విభజించి మూడో కార్పోరేషన్ ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సిద్దం చేశారు. ఈ కార్పోరేషన్ల ద్వారా సంక్షేమ కార్యక్రమాలు చేపట్టాలని జగన్ భావిస్తున్నారు. గృహ నిర్మాణం, పెన్షన్లు, ప్రభుత్వ పరంగా లోన్లు ఇచ్చేందుకు ఈ కార్పోరేషన్లు ఉపయోగపడనున్నాయి. త్వరలోనే బీసీ సంఘాలతో సమావేశమై వారి అభిప్రాయాలు తెలుసుకుని బీసీలకు మూడు కార్పోరేషన్లను సీఎం జగన్ ప్రకటించనున్నారు.

Latest News

 
మార్చి 30 నుండి పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం Thu, Mar 28, 2024, 09:02 PM
ఏపీలో ఎడ్యుకేషనల్ ఆఫీసర్ ప‌రీక్ష వాయిదా Thu, Mar 28, 2024, 08:53 PM
ఏపీకి ముగ్గురు ఎన్నికల పరిశీల‌కుల నియామ‌కం Thu, Mar 28, 2024, 04:22 PM
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు Thu, Mar 28, 2024, 04:07 PM
ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి Thu, Mar 28, 2024, 04:05 PM