అనుభవం లేకపోవడం వల్లే ఓటమి!

by సూర్య | Mon, Oct 14, 2019, 08:01 PM

భారత్ చేతిలో దక్షిణాఫ్రికా వరుసగా రెండో టెస్ట్ మ్యాచ్ లు ఓడిపోయిన సంగతి తెలిసిందే. అయితే ఈ ఓటములపై తాజాగా సఫారీ కెప్టెన్ డుప్లెసిస్ స్పందించాడు. పుణె వేదికగా ఆదివారం ముగిసిన రెండో టెస్టు మ్యాచ్‌లో ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో సఫారీలపై గెలుపొందిన టీమిండియా.. మూడు టెస్టుల సిరీస్‌ని 2-0తో చేజిక్కించుకుంది. ఇక సిరీస్‌లో మిగిలిన ఆఖరి టెస్టు మ్యాచ్ రాంచీ వేదికగా శనివారం నుంచి ప్రారంభంకానుంది. టెస్టు సిరీస్‌లో భారత్ జట్టుకి ఏమాత్రం పోటీనివ్వలేకపోవడానికి కారణం.. జట్టులో సీనియర్ ఆటగాళ్లు తక్కువగా ఉండటమేనని డుప్లెసిస్ చెప్పుకొచ్చాడు. ‘టెస్టు సిరీస్‌లో దక్షిణాఫ్రికా ఓటమికి ప్రధాన కారణం.. టీమ్‌లోని చాలా మంది ఆటగాళ్లకి టెస్టుల్లో తగినంత అనుభవం లేకపోవడమే. సిరీస్ ఆరంభానికి ముందు కూడా ఇదే విషయం నేను చెప్పాను. మరోవైపు భారత టెస్టు జట్టు చాలా మంది అనుభవజ్ఞులతో ఉంది. హసీమ్ ఆమ్లా, ఏబీ డివిలియర్స్, డేల్ స్టెయిన్, మోర్నీ మోర్కెల్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల సేవల్ని ప్రస్తుతం సఫారీ టెస్టు టీమ్‌ కోల్పోయింది. జట్టులో వారి స్థానాల్ని రాత్రికి రాత్రే భర్తీ చేయలేం’ అని డుప్లెసిస్ వెల్లడించాడు. వైజాగ్ టెస్టులో డీన్ ఎల్గర్, డికాక్ సెంచరీలు బాదడంతో బ్యాటింగ్‌లో ఫర్వాలేదనిపించిన దక్షిణాఫ్రికా జట్టు.. పుణె టెస్టులో మాత్రం తేలిపోయింది. దీంతో.. భారత్ జట్టు కనీసం రెండో ఇన్నింగ్స్ కూడా ఆడాల్సిన అవసరం లేకుండా పోయింది. రెండు టెస్టుల్లోనూ టాస్‌ని చేజార్చుకోవడం కూడా దక్షిణాఫ్రికా జట్టుని బాగా దెబ్బతీసింది.


 

Latest News

 
జగన్ గెలుస్తే ఏపీలో శాంతి భద్రతలు ఉండవు Sat, May 04, 2024, 05:47 PM
మా భూమి మాది కాకపోతే మరెవరిది? Sat, May 04, 2024, 05:47 PM
బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే Sat, May 04, 2024, 05:46 PM
రాజకీయ హత్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు Sat, May 04, 2024, 05:43 PM
దేశంలో బీజేపీకి మెజార్టీ వస్తే రాజ్యాంగం మార్చడం ఖాయం Sat, May 04, 2024, 05:43 PM