రైల్వే స్టేషన్‌లలో ఫ్రీ వై-ఫై!

by సూర్య | Mon, Oct 14, 2019, 07:58 PM

ఇండియన్ రైల్వేస్ వైఫై సేవలు అందిస్తోన్న సంగతి తెలిసిందే. ఇండియన్ రైల్వే నెట్‌వర్క్‌లో ప్రయాణించే వారికి ఈ సేవలు అందుబాటులో ఉంటాయి. ప్రధాన్ మంత్రి డిజిటల్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఇండియన్ రైల్వేస్ ప్రధాన రైల్వే స్టేషన్లలో వైఫై సేవలు అందించాలని భావిస్తోంది. ఇప్పటికే పలు స్టేషన్లలో ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. రైల్వే స్టేషన్లలో వైఫై సేవల బాధ్యత రెయిల్‌టెల్ చూసుకుంటుంది. ఈ కంపెనీ గూగుల్‌తో భాగస్వామ్యంతో వైఫై నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేస్తూ వస్తోంది.రైల్‌వైర్ వైఫై సేవలను ఎవరైనా పొందొచ్చు. స్మార్ట్‌ఫోన్‌లో వర్కింగ్ మొబైల్ కనెక్షన్ ఉంటే సరిపోతుంది. రెయిల్‌టెల్ వైఫై సర్వీసులు పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద పబ్లిక్ వైఫై ప్రాజెక్ట్‌గా నిలిచే అవకాశముంది.ఐఆర్‌సీటీసీ వైఫై సర్వీసులతో హైస్పీడ్ ఇంటర్నెట్ పొందొచ్చు. హెచ్‌డీ వీడియోలు చూడొచ్చు. సినిమాలు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. గేమ్స్ ఆడొచ్చు. సాంగ్స్ వినొచ్చు. రైల్‌వైర్ నెట్‌వర్క్‌కు కనెక్ట్ కావడం వల్ల వైఫై సేవలు పొందొచ్చు. వైఫై సెట్టింగ్స్‌లోకి వెళ్లి రైల్‌వైర్ నెట్‌వర్క్ ఆప్షన్ ఎంచుకోవాలి. అప్పుడు బ్రౌజర్‌లో ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మీ ఫోన్ నెంబర్ ఎంటర్ చేయాలి. మీకు పాస్‌వర్డ్ వస్తుంది. దీన్ని ఎంటర్ చేసి ఓకే చేస్తే వైఫై కనెక్ట్ అవుతుంది

Latest News

 
ఆమె గోల పడలేకే భర్త కూడా.. రోజాపై కమెడియన్ పృథ్విరాజ్ ఘాటు వ్యాఖ్యలు Fri, May 03, 2024, 09:38 PM
తిరుమలలో గదులు దొరకడం లేదా? ఇలా చేస్తే రూమ్ గ్యారెంటీ.. టీటీడీ ఈవో Fri, May 03, 2024, 09:35 PM
ముసలోడే కానీ మహానుభావుడు.. స్కూటీలోనే దుకాణమెట్టేశాడు.. పోలీసులే షాక్ Fri, May 03, 2024, 07:47 PM
విజయవాడ సెంట్రల్ బరిలో కవి జొన్నవిత్తుల.. ఎందుకు పోటీ చేస్తున్నారో తెలుసా Fri, May 03, 2024, 07:43 PM
ఏపీలోని రిచెస్ట్ ఎంపీ అభ్యర్థులు వీళ్లే.. వందల కోట్లల్లో ఆస్తులు.. టాప్ 5లో అంతా వాళ్లే Fri, May 03, 2024, 07:40 PM