మీరు నన్ను మేడం అని పిలుస్తున్నారేంటి?

by సూర్య | Mon, Oct 14, 2019, 08:20 PM

ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జగన్మోహన్ రెడ్డి- మెగాస్టార్ చిరంజీవి భేటీ గురించే ఇప్పుడు ఎక్కడ చూసినా హాట్ టాపిక్. అయితే వీరితో పాటు చిరంజీవి సతీమణి, సీఎం జగన్ సతీమణి వై.ఎస్.భారతిలు కూడా ఇరువురు భేటీ అయిన సందర్భంలో ఉన్నారు. చిరు, జగన్‌లు ఒకరినొకరు పుష్పగుచ్ఛాలు ఇచ్చుకునే సమయంలో చిరంజీవి సతీమణి సురేఖ, జగన్ భార్య వై.ఎస్.భారతిల మధ్య ఆసక్తికర వ్యాఖ్యలు చోటుచేసుకున్నాయట. వై.ఎస్.భారతిని, మేడం నమస్తే అంటూ విష్ చేస్తూ సురేఖ మెల్లగా నవ్వారట. దీంతో వై.ఎస్.భారతి వెంటనే మీరు నన్ను మేడం అని పిలుస్తున్నారేంటి? అమ్మ.. మీరు నాకు అమ్మతో సమానం. నాకు మీ కూతురు వయస్సు.. భారతి అని పిలవండి అన్నారట. దీంతో సురేఖ మెల్లగా నవ్వి సైలెంట్‌‌గా ఉండిపోయారట. వీరిద్దరి మధ్య జరిగిన ఆసక్తికర వ్యాఖ్యలను చూసి చిరంజీవి, జగన్‌లు కూడా ముసిముసినవ్వులు నవ్వుకున్నారట.

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM