జ‌గ‌న్‌తో చిరు భేటీకి కార‌ణ‌మిదా?

by సూర్య | Sun, Oct 13, 2019, 10:58 PM

సైరా సినిమాకు సుమారు 270 కోట్లు ఖర్చు చేశారు. కాని 9 రోజుల్లో కలెక్షన్లు 92.64కోట్లు మాత్రమే వసూలైంది. కనీసం 9 రోజుల్లో ఖర్చులో సగం కూడా వసూళ్లు రాలేదు. దీంతో డిస్ట్రిబ్యూటర్లకు పెద్ద దెబ్బే. తెలుగు సినిమాల చరిత్రలోనే రాజమౌళి నిర్మించిన బాహుబలి రెండు పార్టుల చిత్రాలకు భారీగా ఖర్చు చేశారు. ఆ సినిమా క్లిక్ కావడంతో జనం ఎగబడి చూశారు. బాహుబలి పార్ట్ 1 సినిమా వచ్చిన తరువాత ఏడాదికి రెండో పార్ట్ వచ్చింది. అప్పటి వరకు ప్రేక్షకులు ఎదరుచూశారు. ఈ సినిమాకు వెయ్యి కోట్లు చిత్రం విడుదలైన కొన్ని రోజుల్లోనే వచ్చింది. అలానే సైరాకు కూడా వసూళ్ల కలెక్షన్లు వస్తాయని అందరూ భావించారు. కాని సైరాకు ఎదురుదెబ్బే తగిలింది. మరోవైపు తెలంగాణలో ఆర్టీసీ సమ్మె ఉండడంతో సైరా సినిమాపై కూడా ఈ ప్రభావం పడినట్లు తెలుస్తోంది. జనాలకు రవాణా సదుపాయం లేకపోవడంతో ఎవరూ కూడా దియేటర్లకు వెళ్లలేదు. సైరా సినిమాపై టాక్ వస్తే నైనా కనీసం జనం సినిమా చూస్తారేమోనని సైరా టీం భావిస్తోంది. దీంతో తరచూ ప్రెస్ మీట్లు, సక్సెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు.
భారీ బడ్జెట్ తో నిర్మించిన సైరాకు కలెక్షన్లు రాకపోవడంతో ఆ తరువాత ఏం చేయాలనే దానిపై సైరా టీం చర్చించినట్లు తెలిసింది. దీంతో మెగాస్టార్ చిరంజీవి, నిర్మాత రాంచరణ్ లు సైరా సినిమాపై ప్రచారం చేసేందుకు కంకణం కట్టుకున్నట్లు తెలుస్తోంది.  దీంతో  ఏపీ సీఎం జగన్ ను కూడా కలిసేందుకు చిరంజీవి, రాంచరణ్ లు అపాయింట్ మెంట్ కోరారు. ఈ నెల 14న చిరంజీవి, రాంచరణ్ లు జగన్ ను కలువనున్నారు. జగన్ కు కూడా సైరా చిత్రం చూడాలని కోరనున్నారు. ఇలా ప్రముఖులను కలిస్తే కొంత ప్రచారం జరిగి జనం సినిమాను చూస్తారనే భావనలో సైరా టీం ఉన్నట్లు తెలుస్తోంది.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM