స‌.హ‌.తోనే అవినీతి నిర్మూల‌న సాధ్యం : సోమిరెడ్డి

by సూర్య | Sun, Oct 13, 2019, 10:56 PM

యువత చదువు,  పుస్తకాలు, ఉద్యోగాలకే పరిమితం కాకుండా సమాజంలో జరుగుతున్న పరిణామాలను పరిశీలించాలి. ఎక్కడ అన్యాయం జరిగినా సమాచార హక్కు చట్టం ద్వారా పోరాడాలని టీడీపీ లిట్ బ్యూరో సభ్యులు, మాజీ మంత్రి  సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పిలుపు నిచ్చారు.  చారిత్రాత్మకమైన స‌మాచార హక్కు చట్టం  చట్టం అమలులోకి వచ్చి 14 ఏళ్లు పూర్తయిన సంద‌ర్భంగా నెల్లూరులో సమాచార హక్కు జనవేదిక ఆధ్వర్యంలో జరిగిన సమాచార హక్కుచట్టం అవగాహన సదస్సులో ఆయ‌న ముఖ్య అతిధిగా పాల్గొని మాట్లాడుతూ  రాజస్థాన్ లో పేదల ఇళ్ల నిర్మాణంలో జరిగిన అవినీతిని వెలికితీయడంలో భాగంగా జరిగిన పోరాటం సమాచార హక్కు చట్టం అమలులోకి రావడానికి మూలకారణమైందని అన్నారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో ఈ చట్టం అమలులోకి వచ్చింది...అయితే ఆ ప్రభుత్వ హయాంలో ఆదర్శ్ హౌసింగ్ సొసైటీ, 2జీ, కామన్ వెల్త్ గేమ్స్, బొగ్గు కుంభకోణం లాంటి అనేక స్కాంలు ఈ చట్టం ద్వారానే వెలుగులోకి రావడం గొప్పవిషయమని అన్నారు. ప్రజాప్రతినిధులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తే వారి ఆటకట్టించేదే సమాచార  హక్కు చట్టం. టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు నాయుడు సమాచార హక్కు చట్టం అమలుకు ప్రత్యేక ప్రాధాన్యం ఇచ్చారని చెప్పారాయ‌న‌. 

Latest News

 
ఏపీలోని సీనియర్ ఐపీఎస్‌లపై ఈసీ బదిలీ వేటు.. జగన్‌పై రాయిదాడే కారణమా Tue, Apr 23, 2024, 10:52 PM
రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఇక రూ.20 లకే భోజనం Tue, Apr 23, 2024, 10:45 PM
ఏపీలో ఇద్దరు అధికారులను బదిలీ చేసిన ఈసీ Tue, Apr 23, 2024, 09:55 PM
విమానంలో 10 అనకొండలు.. వణికిపోయిన ప్రయాణికులు, అధికారులు Tue, Apr 23, 2024, 09:16 PM
అక్కడ ఎంపీ అభ్యర్థిని మార్చే అవకాశం?.. టీడీపీ నుంచి వచ్చిన నేతకు ఛాన్స్ Tue, Apr 23, 2024, 09:08 PM