"రైతు భరోసా"​ అమలుకు రంగం సిద్ధం..

by సూర్య | Sun, Oct 13, 2019, 12:24 PM

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి నవరత్నాల్లో భాగంగా హామీ ఇచ్చిన ‘రైతు భరోసా’ పథకం అమలుకు తగిన కసరత్తును పూర్తి చేశామని వ్యవసాయ శాఖ కమిషనర్‌ అరుణ్‌కుమార్‌ శనివారం వెల్లడించారు. వెబ్‌ల్యాండ్‌ రికార్డు ఆధారంగా గుర్తించిన లబ్దిదారుల జాబితాను అన్ని గ్రామ పంచాయితీల్లో పొందుపరిచామని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులకు ఏడాదికి రూ. 12500 సహాయం అందించే ఈ పథకం లబ్దిదారుల తొలి జాబితాను ఆదివారం సాయంత్రం ఖరారు చేస్తామని తెలిపారు. అక్టోబరు 15వ తేదీన ఆధార్‌తో అనుసంధానమైన బ్యాంకు ఖాతాల్లో పెట్టుబడి సహాయం అందిస్తామని, 15 తర్వాత కూడా సమస్యలున్న రైతులకు వాటి పరిష్కారం కోసం తగిన సమయం ఇవ్వాలనుకుంటున్నట్టు అరుణ్‌కుమార్‌ తెలియజేశారు. కౌలు రైతులకు కూడా పెట్టుబడి సహాయం అందించే ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు. రైతుల సంక్షేమం కోసం ఎన్ని వేల కోట్లు ఖర్చయినా వెనుకాడవద్దని ముఖ్యమంత్రి ఆదేశించినట్టు కమిషనర్‌ తెలిపారు.

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM