నిమ్మరసంతో దీక్ష విరమించిన కొల్లు రవీంద్ర

by సూర్య | Sun, Oct 13, 2019, 07:41 AM

స్థానికంగా ల భించే ఇసుకను ఇతర రాష్ట్రాలకు మళ్లిస్తు వైసీపీ నేతలు బాగా సొమ్ము చేసుకుంటున్నారని మాజీ మంత్రి కొల్లు రవీంద్ర ఆరోపించారు. ఇసుక కొరత తీర్చాలని డిమాండ్‌ చేస్తూ మచిలీపట్నంలోని తన నివాసంలో కొనసాగించిన 36 గంటల దీక్షను శనివారం ఆయన మాజీ మంత్రులు, టీడీపీ నేతల సమక్షంలో విరమించారు. తాపీ మేస్త్రీ కాసాని కిశోర్‌, సెంట్రింగ్‌ మేస్త్రీ రమణ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్ష వి రమింపజేశారు. అనంతరం రవీంద్ర మాట్లాడారు. భవన ని ర్మాణ రంగం, అనుబంధ రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు ఇసుక కొరత కారణంగా పనులు లేకుండా పోయాయని గుర్తుచేశారు. వారు టీ తాగేందుకు కూడా డబ్బుల్లేక ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తాను గుర్తించానని, అందుకే దీక్ష తలపెట్టానని చెప్పారు. ‘ఇసుక కొరతపై నిరాహార దీక్ష చేస్తున్నట్లు ముందస్తుగానే అనుమతి కోరినా ఇవ్వలేదు. కోనేరు సెంటర్‌లో దీక్షకు వస్తున్న నన్ను అడ్డుకునేందుకు పె ద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. అయినప్పటికీ భవన నిర్మాణ కార్మికులు, పార్టీ కార్యకర్తలు నన్ను అక్కడకు తీసుకెళ్లారు. వారికి కృతజ్ఞతలు. పోలీసులు కోనేరు సెంటర్‌లో న న్ను అనాథ మాదిరిగా ఈడ్చివేశారు. రాష్ట్రవ్యాప్తంగా ఇసుక కొరత తీరేదాకా, కార్మికులకు పని దొరికేవరకు ఈ ఉద్యమాన్ని అందరి సహకారంతో కొనసాగిస్తాం’ అని చెప్పారు.

Latest News

 
నీతిమాలిన మాటలు మానుకో సోమిరెడ్డి Fri, Apr 26, 2024, 02:18 PM
టీడీపీ నేతలు చర్చకు సిద్ధమా? Fri, Apr 26, 2024, 02:17 PM
పేద పిల్లలకు ఆసరాగా నిలిచింది జగన్ మాత్రమే Fri, Apr 26, 2024, 02:16 PM
ఆంధ్ర రాష్ట్రం అప్పులు ఊబిలో ఉండి శ్రీలంక అయిందని చంద్రబాబు మాట్లాడలేదా.? Fri, Apr 26, 2024, 02:15 PM
పియుష్ గోయల్ ఎందుకు రైల్వే జోన్ ఇవ్వలేదు? Fri, Apr 26, 2024, 02:15 PM