తిరుమల భక్తజనసంద్రం!

by సూర్య | Sun, Oct 13, 2019, 07:48 AM

తిరుమల భక్తజనసంద్రమైంది. వారాంతం, రెండో శనివారం, పెరటాసి నెలలో చివరి శనివారం కలసి రావడంతో కొండ కిటకిటలాడుతోంది. రద్దీ ఎక్కువగా ఉండటంతో సర్వదర్శనానికి దాదాపు 20 గంటలు పడుతోంది. వాహనాల్లోనూ, నడక మార్గాల్లోనూ భక్తులు ప్రవాహంలా కొండకు చేరారు. ఉదయం నుంచే వసతిగృహాలు, కల్యాణకట్టల వద్ద భక్తులు బారులుతీరారు. రెండు క్యూకాంప్లెక్సులు నిండి క్యూలైను దాదాపు 3కిలోమీటర్ల వరకు వెలుపలకు వచ్చింది. శనివారం అర్ధరాత్రి ఏకాంతసేవ వరకు దాదాపు 95వేల మంది భక్తులు స్వామిని దర్శించుకోగా మరో లక్షన్నర మంది వెలుపల నిరీక్షిస్తున్నారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM