మట్టి’లో మాణిక్యాలు అంటే వీరేనేమో!

by సూర్య | Sat, Oct 12, 2019, 10:38 PM

తల్లిదండ్రులను ఆట వస్తువుల కోసం ఇబ్బందిపెట్టకుండా సొంత టాలెంట్‌ను ఉపయోగించి ఏకంగా క్యారమ్ బోర్డునే తయారు చేసుకున్నారు. అయితే అది మామూలు క్యారం బోర్డు కాదు. మట్టితో దాన్ని తయారు చేశారు. ఈ పిల్లలు ఇప్పుడు సోషల్ మీడియాను అబ్బురపరుస్తున్నారు. మహీంద్ర గ్రూప్ అధినేత ఆనంద్ మహీంద్ర సైతం ఈ పేదింటి పిల్లల టాలెంట్‌కు ఫిదా అయ్యారు.క్యారమ్ బోర్డులను చెక్కతో తయారు చేస్తారనే సంగతి తెలిసిందే. అయితే, ఈ చిన్నారులు మాత్రం మట్టిని చతురస్ర ఆకారంలో తవ్వి, దాన్ని చదును చేశారు. క్యారమ్ బోర్డులో ఉండే రంథ్రాల స్థానంలో.. నాలుగు వైపులా గుంతలు తవ్వారు. సీసా మూతలను క్యారమ్స్, స్ట్రైకర్‌గా తయారు చేశారు.‘‘ఈ స్ఫూర్తిదాయక చిత్రాన్ని ఈ రోజు ఉదయం వాట్సాప్ వండర్ బాక్స్‌లో చూశా. ఇండియాలో ఊహశక్తికి కొదవలేదని చెప్పేందుకు ఈ ఫొటోనే నిదర్శనం’’ అంటూ ఆనంద్ మహీంద్ర చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. ఈ ఫొటోను ఎక్కడ తీశారో తెలియదుగానీ.. ఆ చిన్నారుల తెలివికి నెటిజనులు ప్రశంసలు కురిపిస్తున్నారు.


 

Latest News

 
భూ పట్టా చట్టంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు : సజ్జల Sat, May 04, 2024, 11:24 PM
ఏపీ రెయిన్ అలెర్ట్ Sat, May 04, 2024, 10:07 PM
ఈసారి ఎన్నికల్లో కూటమిని గెలిపించి మీ భవిష్యత్తును కాపాడుకోండి : పవన్ కళ్యాణ్ Sat, May 04, 2024, 09:26 PM
కొడుకు నామినేషన్‌లో బ్రిజ్ భూషణ్ హంగామా,,,,వేలాది అనుచరులు.. 700 కార్లు.. గాల్లోకి కాల్పులు Sat, May 04, 2024, 09:15 PM
సింహాచలం వెళ్లలేకపోతున్న భక్తులకు గుడ్‌న్యూస్.. చందనం, ప్రసాదం పోస్టల్‌లో పొందండిలా Sat, May 04, 2024, 08:56 PM