హోంగార్డులకు జీతాలు పెంచిన సిఎం జగన్

by సూర్య | Sat, Oct 12, 2019, 10:35 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి...నవరత్నాలతో పాటూ పాదయాత్ర, ఎన్నికల సమయాల్లో ఇచ్చిన ఒక్కో హామీని నెరవేరుస్తున్నారు. తాజాగా హోంగార్డులకు సంబంధించి మరో ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నారు జగన్. రాష్ట్రంలో హోంగార్డుల రోజువారీ డ్యూటీ అలవెన్స్‌ను పెంచారు. ఈ మేరకు శనివారం అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. హోంగార్డులకు రూ.600 నుంచి రూ.710కు డీడీఏ పెరగగా.. ఈ నెల ఒకటి నుంచి పెంచిన డీడీఏ వర్తిస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. తాజా నిర్ణయంతో హోంగార్డుల జీతం రూ. 18 వేల నుంచి రూ. 21,300కు పెరిగింది. ప్రభుత్వ నిర్ణయంపై హోంగార్డులు ఆనందం వ్యక్తం చేశారు. తమ ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకొని.. జీతాలు పెంచినందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.జగన్ పాదయాత్ర సమయంలో హోంగార్డులు ఆయన్ను కలిశారు. తమ సమస్యల్ని వివరించి.. తగిన న్యాయం జరిగేలా చూడాలని కోరారు. జగన్ వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి వస్తే జీతం పెంచడంతో పాటూ సమస్యల్ని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం జీతాలు పెంచుతూ ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM