ఇడుపులపాయలో శిల్పారామం ఏర్పాటు…

by సూర్య | Sat, Oct 12, 2019, 10:08 PM

శిల్పారామాల్లో ప్రస్తుత పరిస్థితిపైనా సీఎం సమీక్ష చేశారని మంత్రి వెల్లడించారు. ప్రస్తుతం ఉన్న శిల్పారామాల అభివృద్ధి, వాటిలో గ్రీనరీని పెంచడంపై అధికారులకు సీఎం పలు సూచనలు చేశారన్నారు. శిల్పారామాల నిర్వహణకు ఇబ్బందిలేకుండా విధానాన్ని తయారుచేయాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. ప్రతి జిల్లాలోనూ కల్చరల్‌ అకాడమీ ఏర్పాటుకు సీఎం నిర్ణయం తీసుకున్నారన్నారు. అయిదెకరాల్లో ఈ అకాడమీలను నిర్మించాలని, రెండేళ్లలోగా వీటిని పూర్తిచేయడానికి అన్ని చర్యలూ తీసుకోవాలని సీఎం ఆదేశించారన్నారు. సంగీతం, నాట్యం సహా ఇతర కళల్లో శిక్షణ, బోధన, ప్రదర్శనలకు కల్చరల్‌ అకాడమీలు వేదిక కావాలన్నారు. కళలు, సంస్కృతిని నిలుపుకోవడానికి, వాటి ప్రాముఖ్యత పెంచడానికి ఈ అకాడమీలు ఉపయోగపతాయని సీఎం తెలిపారన్నారు. కడప జిల్లాలో ఇడుపులపాయలో 10 ఎకరాల్లో శిల్పారామం ఏర్పాటు చేయనున్నామన్నారు.
జిల్లాకో క్రీడా సముదాయం ….
రాష్ట్రంలో క్రీడలు, సదుపాయాలపైనా ముఖ్యమంత్రి వైయస్‌.జగన్‌ సమీక్షించారని మంత్రి తెలిపారు. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రీడా స్టేడియాల నిర్మాణానికి సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారన్నారు. ప్రతి జిల్లాలోనూ స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ ఏర్పాటుకు ప్రణాళిక సిద్ధంచేయాలని సీఎం అధికారులను ఆదేశించారన్నారు. గ్రామీణ ప్రాంత క్రీడాకారులను ప్రోత్సాహించాలని సమావేశంలో నిర్ణయించామన్నారు. బంగారు పతకం సాధించిన వారికి రూ.5 లక్షలు,  వెండి పతకం విజేతలకు రూ.3 లక్షలు, కాంస్యం పతకం సాధిస్తే రూ.2 లక్షల చొప్పున్న ప్రోత్సాహకం అందించనున్నామన్నారు. జాతీయ స్థాయి క్రీడల్లో ప్రతిభ చూపిన వారికి అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించేలా శిక్షణ అందివ్వాలని సీఎం జగన్ ఆదేశించారన్నారు.
టూరిజం కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించం…
రాష్ట్రంలో యువతకు మిగిలిన ప్రాంతాల్లో ఉన్న సంస్కృతీ, సంప్రదాయాలపై అవగాహన కలిగించేలా చర్యలు తీసుకోబోతున్నామన్నారు. ఇతర రాష్ట్రాల సంస్కృతీ, సంప్రదాయాలపైనా రాష్ట్ర యువతకు అవగాహన కల్పిస్తామన్నారు. పర్యాటక శాఖలో పనిచేసే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులను తొలగించే ప్రసక్తే లేదని మంత్రి అవంతి శ్రీనివాసరావు స్పష్టం చేశారు. వాళ్లంతా చిత్తశుద్ధితో పనిచేసి, టూరిజం శాఖ పరిధిలో ఉన్న రిసార్టులను ప్రైవేటు హోటళ్లుకు ధీటుగా సేవలు అందించాలని ఆయన కోరారు. సమావేశంలో రాష్ట్ర అధికార భాషా అమలు సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ పాల్గొన్నారు.

Latest News

 
పిఠాపురం బరిలో ముగ్గురు పవన్ కళ్యాణ్‌లు ఉన్నారన్నది అబద్ధం Thu, Apr 25, 2024, 08:12 PM
పింఛన్ల పంపిణీకి దగ్గర పడుతున్న సమయం.. ఈసీకి చంద్రబాబు లేఖ Thu, Apr 25, 2024, 08:08 PM
ఏపీకి కొత్త ఇంటిలిజెన్స్ చీఫ్‌గా విశ్వజిత్, విజయవాడ సీపీగా పీహెచ్‌డీ రామకృష్ణ Thu, Apr 25, 2024, 08:02 PM
తిరుమలలో ఎన్నాళ్లకెన్నాళ్లకు.. శ్రీవారి భక్తులకు శుభవార్త Thu, Apr 25, 2024, 07:57 PM
తిరుమల వెళ్లే భక్తులకు ఇది కచ్చితంగా శుభవార్తే.. కొండపై తొలిసారి ఇలా Thu, Apr 25, 2024, 07:51 PM