ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు: మంత్రి అవంతి

by సూర్య | Sat, Oct 12, 2019, 10:06 PM

ప్రపంచ పర్యాటక పటంలో ఆంధ్రప్రదేశ్‌కు గుర్తింపు వచ్చేలా తమ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తోందని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు (అవంతి శ్రీనివాసరావు) తెలిపారు. రాష్టంలో 15 నుంచి 20 పర్యాటక ప్రాంతాలను ఎంపిక చేసి, అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధి చేయనున్నామని, ప్రతి జిల్లాలోనూ స్పోర్ట్సు కాంప్లెక్స్ లు, వాటి పక్కనే కల్చరల్ అకాడమీలు ఏర్పాటు చేయనున్నామని వెల్లడించారు. 13 జిల్లాల్లోనూ5, 7 స్టార్ హోటళ్ల ఏర్పాటుకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నామన్నారు. సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో  టూరిజం, ఆర్కియాలజీ, యూత్‌ ఎఫైర్స్‌ శాఖల పనితీరుపై శుక్రవారం సీఎం నివాసంలో సమీక్షా సమావేశం నిర్వహించామన్నారు. ఈ సమావేశంలో టూరిజంతోపాటు చారిత్రక ప్రాంతాల అభివృద్ధి తో పాటు జిల్లాల్లో క్రీడా సదుపాయాల ఏర్పాటుపై సుదీర్ఘంగా చర్చ జరిగిందన్నారు. రాష్ట్రంలో అంతర్జాతీయ స్థాయిలో అభివృద్ధిచేయాల్సిన ప్రాంతాలను ముందుగా ఎంపిక చేసిన తక్షణమే వివరాలు అందజేయాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశించారన్నారు. అతిథ్యం, పర్యాటక రంగంలో అంతర్జాతీయస్థాయిలో పేరు ప్రఖ్యాతలున్న సంస్థల చేత హోటళ్లు ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఇదే సమయంలో కళింగపట్నం, విశాఖపట్నం, కాకినాడ, రాజమండ్రి, పోలవరం, సూర్యలంక, హార్సిలీ హిల్స్, ఓర్వకల్లు, గండికోట తదితర ప్రాంతాలను అధికారులు ప్రతిపాదించగా, పూర్తిస్థాయి వివరాలతో తనకు మళ్లీ సమాచారం అందించాలని సీఎం అధికారులను ఆదేశించారు. గండికోట అడ్వెంచర్‌ అకాడమీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటున్నామని మంత్రి అవంతి శ్రీనివాసరావు అక్కడ తెలిపారు. రాష్ట్రంలో చారిత్రక స్థలాల అభివృద్ధి, మౌలిక సదుపాయాలను కల్పించడానికి, వాటిని సరిగ్గా నిర్వహించడానికి ఆర్కియాలజీ కార్పొరేషన్‌ ఏర్పాటుకు సీఎం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారన్నారు. కొండపల్లికి రోడ్డు, లైట్ల సదుపాయం, బాపు మ్యూజియంలో అభివృద్ది కార్యక్రమాలను తక్షణమే పూర్తిచేయాలని సీఎం ఆదేశించారన్నారు. కృష్ణా, గోదావరిలో మరలా బోట్ల నిర్వహణపై  సమావేశంలో చర్చకు వచ్చిందని, నదీతీరాల్లో కంట్రోల్‌ రూమ్స్‌ ఏర్పాటుపై  ఈ సందర్భంగా సీఎం ఆరాతీశారని మంత్రి వెల్లడించారు. నిర్దిష్టమైన నిర్వహణా పద్ధతులు, కంట్రోల్‌ రూమ్ ల ఏర్పాటు చేయనున్నామన్నారు.  ఆరుగురు ఐఏఎస్ లతో కూడిన కమిటీ ఏర్పాటు చేశామని, ఈ కమిటీ నివేదిక వచ్చిన తరవాత విధివిధానాలు రూపొందిస్తామన్నారు. అనంతరం కమాండ్ కంట్రోల్ రూమ్ లు అనుమతులున్న బోట్లు తిప్పే అవకాశం కలుగుతుందన్నారు. పర్యాటకులు, ప్రయాణికులకు సరైన భద్రతా ప్రమాణాలు ఉన్నాయని సంతృప్తి చెందిన తర్వాతనే బోట్లకు అనుమతి ఇవ్వాలని అధికారులను సీఎం ఆదేశించారన్నారు.

Latest News

 
ఎన్నికల ప్రక్రియ పై సమీక్ష Sat, Apr 20, 2024, 03:23 PM
సూపర్ సిక్స్ పథకాలను ప్రజలకు వివరిస్తూ ప్రచారం Sat, Apr 20, 2024, 02:41 PM
చంద్రబాబుకి శుభాకాంక్షలు తెలిపిన మోదీ Sat, Apr 20, 2024, 02:12 PM
పోలీసుల వ్యవహారశైలి బాధాకరం Sat, Apr 20, 2024, 02:11 PM
చంద్రబాబుకి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన పవన్ Sat, Apr 20, 2024, 02:10 PM