15న వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి!

by సూర్య | Sat, Oct 12, 2019, 09:47 PM

కృష్ణా జిల్లాలో ఈ నెల 15న నిర్వహించే వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల‌ అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఏ.ఎండి.ఇంతియాజ్ అన్నారు. విజ‌య‌వాడ‌లోని కలెక్టర్ విడిది కార్యాలయంలో శుక్రవారం రాత్రి వ్యవసాయ, వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వైయస్సార్ రైతు భరోసా నిర్వహణ ఏర్పాట్లపై కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో 14 కేంద్రాల్లో వైయస్సార్ రైతు భరోసా కార్య క్రమం నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలన్నారు. వైయస్సార్ రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా ప్రతి కేంద్రంలో ఆయా శాఖల ద్వారా 10 నుంచి 15 వరకు స్టాల్ల్స్ ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో వైయస్సార్ రైతు భరోసా కింద కింద గుర్తించిన అర్హులైన రైతుల జాబితాలను గ్రామ సచివాలయంలో అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా రైతు భరోసా కార్యక్రమానికి సంబంధించి బ్యాక్ డ్రాప్, తదితర అంశాలపై కలెక్టర్ అధికారులతో సమీక్షించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ కె.మాధవిలత, జాయింట్ కలెక్టర్-2 కె.మోహన్‌కుమార్, వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ టి.మోహన్‌రావు, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, పట్టు, మైక్రో ఇరిగేషన్ తదితర శాఖల‌ అధికారులు పాల్గొన్నారు.


 

Latest News

 
నిరుద్యోగులను ఏపీ సీఎం జ‌గ‌న్‌ మోసం చేశారు : వైఎస్ షర్మిల Fri, Apr 26, 2024, 10:32 PM
నా సినిమాలను అడ్డుకోవాలని చూశారు : పవన్ క‌ళ్యాణ్ Fri, Apr 26, 2024, 09:41 PM
శ్రీశైలంలో భ్రమరాంబికాదేవికి వైభవంగా వార్షిక కుంభోత్సవం.. ఉత్సవం విశిష్టత ఇదే Fri, Apr 26, 2024, 08:38 PM
టీడీపీకి బిగ్ షాక్.. మాజీ మంత్రి సోదరుడి రాజీనామా.. వైసీపీలో చేరిక ముహూర్తం ఫిక్స్ Fri, Apr 26, 2024, 08:33 PM
కొండెక్కుతున్న నిమ్మ రేటు.. పొదలకూరు మార్కెట్లో రికార్డు ధర Fri, Apr 26, 2024, 08:28 PM