చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ తో రెండోరోజు భేటీ అయిన ప్రధాని మోదీ

by సూర్య | Sat, Oct 12, 2019, 02:00 PM

చెన్నైలో భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు షీ జిన్‌పింగ్‌ వరుసగా రెండో రోజు భేటీ అయ్యారు. తమిళనాడులోని మహాబలిపురంలో నిన్న ఇష్టాగోష్టి జరిపిన వీరిద్దరూ, శనివారం కోవలంలో సమావేశమయ్యారు. ఈ ఉదయం కోవలంలోని తాజ్‌ ఫిషర్‌మ్యాన్స్‌ కోవ్‌ హోటల్‌కు చేరుకున్న జిన్‌పింగ్‌కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం వారివురూ బ్యాటరీ కారులో ప్రయాణించి సమావేశ గదికి చేరుకున్నారు. నిర్షిష్ట ఎజెండా, అధికార లాంఛనాలు లేకుండా కులాసా వాతావరణంలో జరిగిన ఈ భేటీలో అంతర్జాతీయ, ప్రాంతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకోనున్నారు. ఈ భేటీ అనంతరం ప్రతినిధి బృందం స్థాయి చర్చలు జరుగుతాయి. శిఖరాగ్ర సదస్సు తర్వాత రెండు దేశాల అధికారులు విడివిడిగా ప్రకటనలు విడుదల చేయనున్నారు.

Latest News

 
హుస్సేన్‌ పురంలో జనసేన ప్రసారం Wed, May 01, 2024, 11:18 AM
గెలుపే లక్ష్యంగా పనిచేయాలి: భూపేశ్ Wed, May 01, 2024, 11:17 AM
రాష్ట్రానికి తీరని అన్యాయం చేసింది వైసీపీ ప్రభుత్వం: ఏలూరి సాంబశివరావు Wed, May 01, 2024, 10:54 AM
బాలిక అదృశ్యం కేసు నమోదు Wed, May 01, 2024, 10:54 AM
జగన్ పెద్ద మోసకారి: ఎమ్మెల్యే అభ్యర్థి గళ్ళ మాధవి Wed, May 01, 2024, 10:15 AM