ఈ భేటీతో కొత్త శ‌కం ఆరంభం : ప్ర‌ధాని మోదీ

by సూర్య | Sat, Oct 12, 2019, 12:35 PM

హైద‌రాబాద్‌:  చెన్నై స‌మావేశం రెండు దేశాల మ‌ధ్య కొత్త బంధాన్ని ఏర్ప‌రిచింద‌ని ఇవాళ ప్ర‌ధాని మోదీ తెలిపారు. త‌మిళ‌నాడులోని కోవ‌ల‌మ్‌లో చైనా అధ్య‌క్షుడు జిన్‌పింగ్‌, ప్ర‌ధాని మోదీ మ‌ధ్య భేటీ జ‌రిగింది. వూహ‌న్ స‌మ్మిట్ కొత్త ఉత్తేజాన్ని ఇచ్చింద‌న్నారు. రెండు దేశాల మ‌ధ్య విశ్వాసం పెరిగింద‌న్నారు. చెన్నై విజ‌న్‌తో కొత్త శ‌కం ఆరంభ‌మైంద‌న్నారు. చైనా, భార‌త్‌కు చెందిన ప్ర‌తినిధులు కూడా స‌మావేశంలో పాల్గొన్నారు. ఎన్ఎస్ఏ అజిత్ దోవ‌ల్‌, విదేశాంగ మంత్రి జైశంక‌ర్‌, విదేశాంగ కార్య‌ద‌ర్శి విజ‌య్ గోఖ‌లే ఈ భేటీకి హాజ‌ర‌య్యారు. త‌మిళ‌నాడు, చైనా మ‌ధ్య బ‌ల‌మైన సాంస్కృతిక‌, వాణిజ్య సంబంధాలు ఉన్నాయ‌ని మోదీ అన్నారు. గ‌త రెండు వేల ఏళ్ల నుంచి భార‌త్‌, చైనా ఆర్థిక శ‌క్తులుగా ఉన్నాయ‌న్నారు.

Latest News

 
నేడు ప్రపంచ పత్రికా స్వేచ్ఛ దినోత్సవం Fri, May 03, 2024, 10:48 AM
భవిష్యత్తు కోసం టిడిపి అభ్యర్థిని గెలిపించండి Fri, May 03, 2024, 10:37 AM
టీడీపీలో చేరిన మాజీ సర్పంచులు Fri, May 03, 2024, 10:35 AM
సమస్యాత్మకమైన పోలింగ్ కేంద్రాలు పరిశీలించిన ఎస్సై Fri, May 03, 2024, 10:31 AM
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM