ఏపీఎస్ ఆర్టీసి పేరు మార్పు

by సూర్య | Sat, Oct 12, 2019, 12:41 PM

ఏపీఎస్ ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేసే ప్రక్రియ వేగంగా కొనసాగుతోంది. అదే విధంగా ఏపీఎస్ ఆర్టీసి పేరు మారుస్తూ కూడా సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పై ఆర్టీసీ పేరును ప్రజా రవాణా శాఖ (పీటీడీ)గా మారుస్తున్నట్లు రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇప్పటికే ఆర్టీసి విలీనానికి సంబంధించిన ప్రక్రియ పూర్తి కావొచ్చింది. ఉద్యోగులకు వేతనాలు ఎంత ఉండాలి, వారికి ఏ స్థాయి కల్పించాలి, పాలన యంత్రాంగం ఎలా ఉండాలనే అంశాల పై అధ్యయనానికి సర్కార్ ఆరుగురు నిపుణులతో ఓ కమిటీ వేసింది. దీనికి రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి ఛైర్మన్‌గా ఉంటారు. ఆర్థికం, సాధారణ పరిపాలన, (సర్వీసులు), పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్, న్యాయ శాఖల ముఖ్య కార్యదర్శులను కమిటీలోకి సభ్యులుగా తీసుకున్నారు. ఇక ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (పరిపాలన) సమన్వయకర్తగా వ్యవహరిస్తారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత అధికారికంగా ఆర్టీసి పేరు మార్పును అమల్లోకి తీసుకు వస్తారు.

Latest News

 
వైసీపీ, జనసేన మధ్య క్వశ్చన్ పేపర్ ఫైటింగ్.. ఇదేందయ్యా ఇది.. ఎక్కడా చూళ్లే! Fri, Apr 19, 2024, 10:21 PM
జగన్‍‌పై ఎన్నికల సంఘానికి జనసేన ఫిర్యాదు. Fri, Apr 19, 2024, 09:50 PM
ఏపీ సీఎం జగన్‌పై ఈసీకి ఫిర్యాదు Fri, Apr 19, 2024, 09:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. ఈ నెలలో ఆ 3 రోజులు ఆర్జిత సేవలు బంద్ Fri, Apr 19, 2024, 09:04 PM
బుట్టా రేణుక ఆస్తుల వివరాలివే.. ఇటీవలే ఆమె పేదరాలు అంటూ సీఎం జగన్ కామెంట్స్ Fri, Apr 19, 2024, 08:53 PM