కాశ్మీర్ అంశంపై ట్రంప్ తో మోడీ మాట్లాడారు: అమిత్ షా

by సూర్య | Fri, Oct 11, 2019, 06:27 PM

కాశ్మీర్ అంశం పూర్తిగా భారత్ అంతర్గత విషయమని.. దీనిపై ఎవరి జోక్యం అవసరం లేదన్న విషయాన్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తో ప్రధాని మోడీ చెప్పారని హోంశాఖ మంత్రి అమిత్ షా మరోసారి స్పష్టం చేశారు. ఒకవేళ కాశ్మీర్ పై ఏదేశమైనా మాట్లాడితే అది పూర్తిగా భారత్ అంతర్గత విషయమని అమిత్ షా అన్నారు. కాశ్మీర్ విషయంలో ఎవరి జోక్యం అవసరం లేదని, ఈ విషయంపై తమ పార్టీ స్పష్టతతో ఉందన్నారు. మహారాష్ట్రలో ఎన్నికల ప్రచారంలో పాల్గొని అమిత్ షా ప్రసంగించారు. జమ్మూ కాశ్మీర్ లో ఆర్టికల్ 370 రద్దు విషయాన్ని కాంగ్రెస్ పార్టీ, ఎన్సీపీలు వ్యతిరేకించాయని, కాశ్మీర్ పై ఆ రెండు పార్టీల వైఖరేంటో ఓటర్లే అడగాలని సూచించారు.

Latest News

 
అల్లి నగరంలో ఎన్నికల ప్రచారం Mon, May 06, 2024, 03:55 PM
పోస్టల్ బ్యాలెట్స్ కి అపూర్వ స్పందన Mon, May 06, 2024, 03:53 PM
పేదల సంక్షేమమే వైసీపీ ధ్యేయం: నాగార్జున Mon, May 06, 2024, 03:51 PM
భైరవకోనలో ప్రత్యేక పూజలు Mon, May 06, 2024, 03:49 PM
టీడీపీ విజయాన్ని వైసీపీ ఆపలేదు: బిఎన్ విజయ్ Mon, May 06, 2024, 03:46 PM