ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ విడుదల

by సూర్య | Fri, Oct 11, 2019, 06:06 PM

ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఒప్పో నుంచి మరో కొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి వచ్చేసింది. మరి దాని ధర ఎంత? ఏవేం ఫీచర్లున్నాయి? కెమెరాకు పెట్టింది పేరైన ప్రముఖ స్మార్ట్ ఫోన్ సంస్థ ఒప్పో నుంచి ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్న ఒప్పో కే5 స్మార్ట్ ఫోన్ గురువారం మార్కెట్లోకి వచ్చేసింది. దీనికి సంబంధించి ఇప్పటికే ఎన్నో టీజర్లు, పోస్టర్లు కూడా వచ్చాయి. ఈ ఫోన్ ను గురువారం చైనా మార్కెట్లో లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్ భారతమార్కెట్లో ఎప్పుడు లాంచ్ కానుందో తెలియరాలేదు.


సాధారణంగా ఒప్పోకు సంబంధించిన ఫోన్లు ఏవైనా చైనాలో లాంచ్ అయితే ఎక్కువ గ్యాప్ లేకుండానే మనదేశానికి కూడా వచ్చేస్తాయి. అయితే ఈ ఫోన్ మాత్రం డిసెంబర్ చివర్లో మన దేశానికి వచ్చే అవకాశముందని వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతానికి ఈ ఫోన్ మన దేశంలో లాంచ్ చేయడంపై ఒప్పో ఎటువంటి ప్రకటనలూ చేయలేదు. అయితే ఈ ఫోన్ మనదేశంలో ఎప్పుడు లాంచ్ అవుతుందనే విషయం మాత్రం త్వరలోనే ఒప్పో వెల్లడించే అవకాశాలు ఉన్నాయి.


ఒప్పో కే5 స్మార్ట్ ఫోన్ ఫీచర్లు..


ఈ ఫోన్ లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్ డీ+ అమోఎల్ఈడీ(AMOLED) డిస్ ప్లేను అందించారు. ఇందులో 1080x2340 పిక్సెల్స్ కెమెరా.


ఇందులో వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి.


ప్రధాన కెమెరాగా 64 మెగా పిక్సెల్ సామర్థ్యమున్న శాంసంగ్ జీడబ్ల్యూ1 సెన్సార్.


సెల్ఫీ కెమెరా సామర్థ్యం 32 మెగా పిక్సెల్ గా ఉంది.


బ్యాటరీ సామర్థ్యం 3920 ఎంఏహెచ్


ధర ఎంత?..


ఇందులో మొత్తం మూడు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. వాటిలో 6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 1,899 యువాన్లు(సుమారు రూ.18,900)గానూ, 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,099 యువాన్లు(సుమారు రూ.20,900)గానూ, 8 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధరను 2,499 యువాన్లుగానూ(సుమారు రూ.24,900) నిర్ణయించారు. చైనాలో దీనికి సంబంధించిన ప్రీ-బుకింగ్స్ ఇప్పటికే ప్రారంభం కాగా, సేల్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానుంది. ఈ ఫోన్ బ్లూ, గ్రీన్, వైట్ గ్రేడియంట్ రంగుల్లో అందుబాటులో ఉండనుంది.

Latest News

 
కుటుంబ సభ్యులతో కలిసి సీఎం రమే నామినేషన్ Wed, Apr 24, 2024, 03:21 PM
5 ఎకరాలు అరటి తోట దగ్ధం Wed, Apr 24, 2024, 02:39 PM
కాకినాడలో పవన్ కళ్యాణ్ కి ఘన స్వాగతం Wed, Apr 24, 2024, 01:42 PM
మద్యంలో విషం కలుపుకొని తాగిన రైతు Wed, Apr 24, 2024, 01:42 PM
మరొకసారి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని గెలిపించండి Wed, Apr 24, 2024, 01:42 PM