దుర్గా పూజ ఉత్సవాల్లో తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి

by సూర్య | Fri, Oct 11, 2019, 05:54 PM

తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపి నుస్రత్‌ జహాన్‌ తనపై వస్తున్నవిమర్శలను పట్టించుకోనని అన్నారు. ఇటీవల దుర్గా పూజ ఉత్సవాల్లో నుస్రత్‌ జహాన్‌ పాల్గొన్నారు. దీనిపై ఉత్తర్‌ ప్రదేశ్‌కు చెందిన ముస్లిం మత పెద్ద ఒకరు ఆమపై విమర్శలు చేశారు. దీనిపై నుస్రత్‌ జహాన్‌ స్పందిస్తూ తాను దేవుడికి ప్రత్యేక శిశువునని చెప్పారు. ఇటువంటి విమర్శలను తాను పట్టించుకోనని అన్నారు. అన్ని పండుగలను తాను జరుపుకొంటానని ఆమె అన్నారు. తాను మానవత్వాన్ని, ప్రేమను అన్నింటికంటే ఎక్కువగా గౌరవిస్తానని ఆమె చెప్పారు. తాను చాలా ఆనందంగా ఉన్నానన్నారు. బెంగాలీ హిందూ సంప్రదాయమైన సిందూర్‌ ఖేలాలో నుస్రత్‌ జహాన్‌ తన భర్త నిఖిల్‌ జైన్‌తో కలిసి పాల్గొన్నారు. ఈ కార్యక్రమం కోల్‌కతాలోని చల్తాబగన్‌ దుర్గాపూజ మండపంలో జరిగింది. రాజకీయవేత్తగా మారిన నటీమణి నుస్రత్‌ జహాన్‌ తన పేరును, మతాన్ని మార్చుకోవాలని, ఆమె ఇస్లాంను, ముస్లింలను అగౌరవపరుస్తోందని ఇతెహాస్‌ ఉలేమా-ఎ-హింద్‌ సంస్థ ఉపాధ్యక్షుడు ముఫ్తి అసద్‌ కస్మి గత సోమవారంనాడు అన్నారు.


 


 

Latest News

 
పిఠాపురంలో సాయిధరమ్ తేజ్ మాస్ స్పీచ్.. అరుపులే, అరుపులు Sun, May 05, 2024, 10:18 PM
ఏపీలో రేపటి నుంచి వానలు.. ఆ జిల్లాలలో పిడుగులు పడే ఛాన్స్ Sun, May 05, 2024, 10:14 PM
ఇటుకల బట్టీలో అనుమానం.. వెళ్లి ఓ గది తలుపులు తీసిన పోలీసులు షాక్ Sun, May 05, 2024, 08:49 PM
ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. పోలింగ్‌కు ముందే ఒక రోజు సెలవు, ఆదేశాలు వచ్చేశాయి Sun, May 05, 2024, 08:45 PM
తిరుమలకు వెళ్లే భక్తులకు గుడ్‌న్యూస్.. ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్‌లలో ఆగుతాయి Sun, May 05, 2024, 08:42 PM