హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ఖాతాదారులకు అదిరిపోయే ఆఫర్లు

by సూర్య | Fri, Oct 11, 2019, 05:22 PM

దీపావళి, షాపింగ్ అనే పదాలకు సారూప్యత ఉంటుంది. దీపావళి వచ్చిందంటే చాలు ఆపర్ల మోత మోగిపోతుంది. దేశవ్యాప్తంగా షాపులు, స్టోర్ల ముందు డిస్కౌంట్ బోర్డులు, ఫ్లెక్సీలు దర్శనమిస్తాయి. కస్టమర్లు ఏదైనా కొనుగోలు చేయాలంటే ఈ టైమ్‌లోనే మంచి డీల్స్ సొంతం చేసుకోవచ్చు.


కస్టమర్ల దీపావళి సంబరాలను రెట్టింపు చేసేందుకు ఇప్పుడు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కూడా సిద్ధమైంది. ఈ పండుగ సీజన్‌లో అదిరిపోయే ఆఫర్లు మోసుకువచ్చింది. దీని కోసం ఫెస్టివ్ ట్రీట్స్ పేరుతో మెగా డిస్కౌంట్ ఆఫర్లకు తెరతీసింది. నెల రోజుల పాటు అందుబాటులో ఉండనున్న ఈ ఫెస్టివ్ ట్రీట్స్‌లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్న 10,000కి పైగా స్టోర్లలో 1,000కి పైగా బ్రాండ్లపై డిస్కౌంట్ పొందొచ్చు. అలాగే బ్యాంకింగ్ ప్రొడక్ట్స్, కార్ లోన్స్, పర్సనల్ లోన్స్ వంటిపై బెస్ట్ డీల్స్ సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఇన్‌స్టోర్, ఆన్‌లైన్ కొనుగోళ్లపై అదనపు క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తుంది.


 


కొత్త ఫోన్‌కు అప్‌గ్రేడ్ అవ్వండి..


దీపావళి వచ్చిందంటే చాలు.. స్మార్ట్‌ఫోన్స్ సహా ఇతర గ్యాడ్జె‌ట్స్‌పై అదిరిపోయే ఆఫర్లు అందుబాటులోకి వస్తాయి. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిటైలర్లు డిస్కౌంట్, క్యాష్‌బ్యాక్, వారంటీ ఎక్స్‌టెండ్ వంటి వాటితో కస్టమర్లను ఊరిస్తారు. అదే మీరు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కస్టమర్ అయితే స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, స్మార్ట్ స్పీకర్లు వంటి పలు ప్రొడక్టులపై ఇంకా అదనపు డిస్కౌంట్ ఆఫర్లు పొందొచ్చు.


1. ఐఫోన్ 11 ఫోన్‌ కొనుగోలుపై ఏకంగా రూ.7,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా జరిపే ఈఎంఐ, నాన్ ఈఎంఐ లావాదేవీలకు ఇది వర్తిస్తుంది.


2. షావోమి, వివో, ఒప్పొ స్మార్ట్‌ఫోన్లపై 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. శాంసంగ్ ఫోన్లపై 15 శాతం వరకు క్యాష్‌బ్యాక్ పొందొచ్చు.


3. రిలయన్స్ డిజిటల్, జియో డిజిటల్ లైఫ్ స్టోర్లలో కొనుగోలు చేస్తే 10 శాతం వరకు క్యాష్‌బ్యాక్ వస్తుంది.


4. అలాగే పైన పేర్కొన్న బ్రాండ్లలో కొన్ని ప్రొడక్టులపై 12 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం కూడా పొందొచ్చు.


5. లేటెస్ట్ వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్స్‌పై రూ.3,000 వరకు తక్షణ డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు.


 


హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు చెందిన అన్ని రకాల డెబిట్ కార్డులు, క్రెడిట్ కార్డులపై 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. అలాగే 10 శాతం క్యాష్‌బ్యాక్ కూడా లభిస్తోంది.

Latest News

 
ధర్మవరానికి ఔటర్ రింగ్ రోడ్డు తెస్తా Mon, May 06, 2024, 01:57 PM
దేశం మొత్తం 400కు పైగా సీట్లు సాధిస్తాం: అమిత్ షా Mon, May 06, 2024, 01:55 PM
ఉమ్మడి అనంత జిల్లాలో భానుడి భగభగలు Mon, May 06, 2024, 01:52 PM
రైతుల అక్రందనే జగన్ పతనానికి నాంది: అమిలినేని Mon, May 06, 2024, 01:49 PM
ద్విచక్ర వాహనం అదుపుతప్పి యువకుడి మృతి Mon, May 06, 2024, 01:46 PM