థాయిలాండ్ లో మృతిచెందిన మధ్యప్రదేశ్ యువతీ

by సూర్య | Fri, Oct 11, 2019, 02:23 PM

బెంగళూరులో టెక్కీగా పని చేస్తున్న ఆమె... హాంగ్ కాంగ్ బేస్డ్ ఆర్గనైజేషన్ ఫుకెట్ లో నిర్వహించిన ఓ కాన్ఫరెన్స్ కు వెళుతుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. థాయిలాండ్ లో భారతీయ మహిళా సాఫ్ట్ వేర్ ఇంజినీర్ ప్రగ్య పాలీవాల్ (29) దుర్మరణం పాలయ్యారు.ప్రస్తుతం ఆమె మృతదేహం థాయిలాండ్ లోని ఓ ఆసుపత్రి మార్చురీలో ఉంది. ప్రగ్య కుటుంబం మధ్యప్రదేశ్ ఛత్తార్ పూర్ జిల్లాలో ఉంటోంది.  ప్రగ్య మరణించిన విషయాన్ని బెంగళూరులో ఉన్న ఆమె రూమ్మేట్ కు థాయిలాండ్ అధికారులు తెలియజేశారు. ఈ విషయాన్ని ఆమె రూమ్మేట్ ప్రగ్య కుటుంబసభ్యులకు తెలిపారు. తమ కూతురు చనిపోయిందన్న వార్తతో ఆమె తల్లిదండ్రులు షాక్ అయ్యారు. మరోవైపు ఆమె తల్లిదండ్రులకు థాయిలాండ్ వెళ్లడానికి పాస్ పోర్టు కూడా లేకపోవడం కలచివేస్తోంది. ప్రగ్య మరణ వార్తను తెలుసుకున్న స్థానిక ఎమ్మెల్యే అలోక్ చతుర్వేది... ఈ విషయాన్ని వెంటనే ముఖ్యమంత్రి కమల్ నాథ్ దృష్టికి తీసుకెళ్లారు. అంతేకాదు, ఆమె కుటుంబసభ్యులను కలుసుకున్నారు. ఈ సందర్భంగా చతుర్వేది మాట్లాడుతూ, కారు యాక్సిడెంట్ లో ప్రగ్య మరణించిన విషయాన్ని ఆమె రూమ్మేట్ తెలిపిందని చెప్పారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం ప్రగ్య మృతదేహం ఫుకెట్ లోని పాటాంగ్ ఆసుపత్రిలో ఉందని తెలిపారు.

Latest News

 
తిరుమలలో ప్రత్యేక ఉత్సవాలు.. మూడు రోజులు ఆ సేవలు రద్దు Tue, May 07, 2024, 10:53 PM
రంగంపేట చెక్‌పోస్ట్‌ దగ్గర రూ.2.71 కోట్లు సీజ్.. ఆ ఒక్క పేపర్ ఇవ్వగానే డబ్బులు విడుదల Tue, May 07, 2024, 10:14 PM
తిరుమలలో ఒక్కరోజు అన్నదానానికి ఎంత ఖర్చు అవుతుందో తెలుసా? Tue, May 07, 2024, 10:09 PM
విజయవాడవాసులకు అలర్ట్.. ఆ ప్రాంతం రెడ్ జోన్.. ట్రాఫిక్ మళ్లింపులు, ఆంక్షలు ఇలా Tue, May 07, 2024, 10:04 PM
వైఎస్ షర్మిలపై కేసు నమోదు.. ఆ వ్యాఖ్యలతో చిక్కులు Tue, May 07, 2024, 09:59 PM