కాశ్మీర్ ప్రజల హక్కుల్ని కాలరాయడం దేశద్రోహంతో సమానం: ప్రియాంక గాంధీ

by సూర్య | Sun, Aug 25, 2019, 04:21 PM

జాతీయవాదం పేరుతో కాశ్మీర్ లో అణచివేతకు పాల్పడుతున్నారంటూ ఆగ్రహం శ్రీనగర్ ఎయిర్ పోర్టు నుంచి రాహుల్ గాంధీ సహా విపక్ష ప్రతినిధుల బృందాన్ని వెనక్కి తిప్పి పంపడంపై కాంగ్రెస్ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ మండిపడ్డారు. కాశ్మీర్ లో ప్రజల హక్కుల్ని కాలరాస్తున్నారని, ఇంతకంటే రాజకీయం ఉండబోదని, ఇది దేశద్రోహంగా భావించాల్సి ఉంటుందని అన్నారు. ప్రభుత్వ వైఖరిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. జాతీయవాదం పేరుతో కాశ్మీర్ ప్రజలను అణచివేస్తున్నారంటూ ప్రియాకం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతేకాకుండా, శ్రీనగర్ నుంచి విమానంలో వస్తున్న సమయంలో రాహుల్ వద్దకు వచ్చిన ఓ కాశ్మీర్ మహిళ కన్నీటి పర్యంతం అవుతూ తమ కష్టాలను వెళ్లబోసుకున్న వీడియోను కూడా ప్రియాంక ట్వీట్ చేశారు. ఇలాంటి వారు కాశ్మీర్ లో లక్షల మంది ఉన్నారంటూ తన ట్వీట్ లో పేర్కొన్నారు.

Latest News

 
తాకాసివీధిలో నూకాంబిక అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల Tue, May 07, 2024, 02:46 PM
సీఎం జగన్ కీలక వ్యాఖ్యలు Tue, May 07, 2024, 02:45 PM
చెంగారెడ్డి అన్న కుమారుడు వైసీపీలో చేరిక Tue, May 07, 2024, 01:46 PM
వాలంటీర్లు కలిసికట్టుగా పనిచేసి వైసిపి గెలుపుకు కృషి చేయాలి Tue, May 07, 2024, 12:50 PM
పోస్టల్ బ్యాలెట్ సెంటర్ ను తనిఖీ చేసిన ఆర్డిఓ Tue, May 07, 2024, 12:40 PM