తీవ్రవాదం పెరిగితే మా బాధ్యత కాదు : ఆరిఫ్

by సూర్య | Sun, Aug 25, 2019, 02:22 PM

కశ్మీర్ విషయమై రాజ్యాంగంలో మార్పులు చేసిన పర్యవసానంగా తీవ్రవాదం పెరిగితే అందుకు పాకిస్థాన్ బాధ్యత వహించబోదని ఆ దేశాధ్యక్షుడు ఆరిఫ్ అల్వీ స్పష్టం చేశారు. భద్రతామండలిలో కశ్మీర్ అంశంపై చేసిన తీర్మానాలను భారత్ తుంగలో తొక్కిందని అన్నారు. పుల్వామా వంటి ఘటనలను భారత్ సాకుగా చూపి పాకిస్థాన్ పై భారత్ దాడులకు పాల్పడవచ్చేమో కానీ, తాము మాత్రం యుద్ధానికి వ్యతిరేకం అని అన్నారు. ఒకవేళ భారత్ యుద్ధానికి దిగితే, ప్రత్యర్థిని ఎదుర్కొనే హక్కు తమకుందని తెలిపారు. భారత్ లో అధికారంలో ఉన్న మోదీ సర్కారు మూర్ఖుల స్వర్గంలో ఉందని, కశ్మీర్ విషయంలో నిప్పుతో చెలగాటమాడతున్నారని అల్వీ విమర్శించారు. ఇస్లామాబాద్ లో విదేశీ మీడియా ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ​

Latest News

 
జగన్ గెలుస్తే ఏపీలో శాంతి భద్రతలు ఉండవు Sat, May 04, 2024, 05:47 PM
మా భూమి మాది కాకపోతే మరెవరిది? Sat, May 04, 2024, 05:47 PM
బాబుకు ఓటేస్తే.. పథకాలు ముగింపే Sat, May 04, 2024, 05:46 PM
రాజకీయ హత్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారు Sat, May 04, 2024, 05:43 PM
దేశంలో బీజేపీకి మెజార్టీ వస్తే రాజ్యాంగం మార్చడం ఖాయం Sat, May 04, 2024, 05:43 PM