అమ్మాయని లిఫ్ట్‌ ఇస్తే...అనుకోని పని చేసింది

by సూర్య | Sun, Aug 25, 2019, 02:51 PM

ఓ యువకుడు అమ్మాయి లిఫ్ట్‌ అడిగింది కదా అని తన బైక్ పై ఎక్కించుకుంటే అతన్నే బురుడి కొట్టించి పరారయ్యింది. ఇక ఈ ఘటన కడప జిల్లాలో జరగగా వివరాలు ఇలా ఉన్నాయి. ఈనెల 17వ తేదీన శివ అనే యువకుడు అపాచీ బైకుపై పనిమీద రిమ్స్‌కు వెళుతుండగా మార్గమధ్యంలో కలసపాడు మండలం ఎగువ రామాపురానికి చెందిన బసిరెడ్డి లీలావతి (21) అనే యువతి బైకును లిఫ్ట్ అడిగింది. రిమ్స్‌లో తమ బంధువులు ఉన్నారని, అర్జెంటుగా వెళ్లాలని చెప్పగా, ఎదో సహాయం చేద్దాంలే అని ఆమెను బైకుపై ఎక్కించుకుని ఆ యువకుడు రిమ్స్‌కు బయలుదేరాడు.


రిమ్స్‌లోని దంతవైద్య కళాశాల వద్దకు వెళ్లగానే అతనికి ఫోన్‌ రావడంతో బైకును అక్కడే ఆపి ఫోన్‌ మాట్లాడేందుకు పక్కకు వెళ్లాడు. ఇదే అదనుగా భావించిన యువతి ఆ బైకును స్టార్ట్‌ చేసుకుని వేగంగా ఉడాయించింది. ఈ విషయంపై బాధితుడు పోలీసులు ఫిర్యాదు చేయగా, ఈనెల 21వ తేదీన కేసు నమోదు చేశారు. నిందితురాలి పూర్తి వివరాలను తెలుసుకుని ఆమె కడపకు రాగానే పసిగట్టి శనివారం సాయంత్రం సింగపూర్‌ టౌన్‌షిప్‌ సర్కిల్‌ వద్ద అరెస్టు చేశారు. 

Latest News

 
మత్స్యకారుల సుడి తిరిగింది.. వలలో పడిన బంగారు చేపలు.. ఏకంగా లక్షల్లో Wed, Apr 24, 2024, 10:00 PM
వైసీపీ శ్రేణుల్లో జోష్ నింపిన కేసీఆర్ వ్యాఖ్యలు.. కానీ వెంటాడుతోన్న ఆ భయం Wed, Apr 24, 2024, 09:11 PM
ఏపీకి వాతావరణశాఖ తీవ్ర హెచ్చరికలు, ఎల్లో అలర్ట్ జారీ.. రైల్వేశాఖకు ఐఎండీ కీలక సూచనలు Wed, Apr 24, 2024, 09:10 PM
చంద్రబాబు నుంచి చింతమనేని ప్రభాకర్‌కు ఫోన్ కాల్ Wed, Apr 24, 2024, 09:10 PM
ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్.. నాలుగు ప్రత్యేక రైళ్లు, ఈ స్టేషన్లలో ఆగుతాయి Wed, Apr 24, 2024, 09:01 PM