ఉపరాష్ట్రపతి నెల్లూరు పర్యటన రద్దు

by సూర్య | Sat, Aug 24, 2019, 02:50 PM

కేంద్ర మాజీ మంత్రి, బీజేపీ సీనియర్ నేత అరుణ్ జైట్లీ మృతి చెందడంతో ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు  నెల్లూరు పర్యటన    కార్యక్రమాలను రద్దు చేసుకున్నారు. చెన్నై పర్యటనలో ఉన్న వెంకయ్య ఉన్నపళంగా ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. చెన్నై నుంచి వెంకయ్య ఈ రోజు నెల్లూరుకి రావాల్సి ఉంది. కాగా.. జైట్లీ మరణ వార్త వినాల్సి రావడంతో..ఉన్నపళంగా చెన్నై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడుతూ, ఆయన ఈ మేరకు స్పందించారు.
వ్యక్తిగతంగా తనకు అరుణ్ జైట్లీ మరణం, తీరని లోటు అని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. జైట్లీ తనకు దీర్ఘకాల మిత్రుడని, తనకున్న అత్యంత సన్నిహితుల్లో ఒకరని చెప్పారు. ఆయన ఒక న్యాయకోవిదుడని, ఉత్తమ పార్లమెంటేరియన్ అని అన్నారు. పన్ను విధానంలో సమూల మార్పులకు ఆయన కృషి చేశారని, జీఎస్టీని తీసుకురాడంలో ప్రముఖ పాత్రను పోషించారని తెలిపారు. 


 

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM