ఈ పిల్లాడు మృత్యుంజయుడే...!

by సూర్య | Thu, Aug 22, 2019, 07:05 PM

వర్షం పడుతున్న వేళ చినుకులు తనను తాకకుండా గొడుగు అడ్డుపెట్టుకొని ఆడుకుంటున్నఓ చిన్నారిపైకి కారు దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కొద్ది క్షణాలుపాటు కారు కిందే ఉన్న ఆ చిన్నోడు అదృష్టవశాత్తు చిన్నపాటి గాయం కూడా కాకుండా ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ సంఘటన సూరత్‌లో చోటుచేసుకుంది. సూరత్‌లోని ఓ కాలనీలో వర్షం పడుతుండగా గొడుగుతో బయటకు వచ్చిన పిల్లాడు నడుస్తూ ఉన్నట్టుండి రోడ్డుపై కూర్చొని పారుతున్న వర్షం నీటితో ఆడుకోవడం మొదలుపెట్టాడు. ఆ సమయంలో ఓ వ్యక్తి తన కుటుంబాన్ని కారులో ఎక్కించుకొని రివర్స్ చేస్తూ వెనక్కి వచ్చాడు. పిల్లాడు అక్కడున్న విషయాన్ని గమనించని కారు డ్రైవర్‌ చిన్నారిపైకి ఎక్కించేశాడు. రివర్స్ చేసిన కారు ముందుకు వెళ్లేందుకు సిద్దమవుతున్న సమయంలో చుట్టుపక్కల ఉన్న వాళ్లు కారు కింద పిల్లాడున్న విషయాన్ని డ్రైవర్‌కు చెప్పడంతో అతను అప్రమత్తమై కారు ఆపడంతో పిల్లాడి ప్రాణాలు దక్కాయి. సమీపంలో ఉన్న చిన్నారి తల్లి భయంతో పరుగున వచ్చి చిన్నారిని హత్తుకుంది. ఈ ఘటన మొత్తం సమీపంలో ఉన్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ దృశ్యాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయగా చూసినవారందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ.. పిల్లాడు మృత్యుంజయుడంటూ వ్యాఖ్యానిస్తున్నారు.

Latest News

 
గుంతకల్ రైల్వేస్టేషన్ వద్ద మహిళ అనుమానాస్పద కదలికలు.. తీరా విచారిస్తే.. వామ్మో Sun, Apr 28, 2024, 10:48 PM
కూటమి మేనిఫెస్టోకు ముహూర్తం ఫిక్స్.. ఎప్పుడో చెప్పిన పవన్ కళ్యాణ్ Sun, Apr 28, 2024, 10:22 PM
తిరుమల శ్రీవారి భక్తులకు ముఖ్య గమనిక.. మేలో విశేష ఉత్సవాలు, ప్రత్యేకత ఏంటంటే! Sun, Apr 28, 2024, 09:00 PM
ఈ ఏడాదిలోనే అత్యధిక ఉష్ణోగ్రత నమోదు.. ఆలోపే ఐఎండీ చల్లటి వార్త Sun, Apr 28, 2024, 08:55 PM
ఆ కారణంతోనే వైసీపీ నుంచి బయటకు వచ్చా.. అంబటి రాయుడు Sun, Apr 28, 2024, 08:50 PM