ఇంట్లో లైసెన్సు మరచి వాహనం తీస్తే 5 వేలు ఫైన్

by సూర్య | Thu, Aug 22, 2019, 01:18 PM

ట్రాఫిక్ రూల్స్ పాటించకున్న, ఇష్టానుసారం  ఉల్లంఘిస్తే… భారీ మూల్యం చెల్లించక తప్పదని ఏపీ పోలీసులు వాహనదారులని హెచ్చరిస్తున్నారు. 


ఇటీవల  కేంద్ర ప్రభుత్వం కొత్త ట్రాఫిక్ రూల్స్   సెప్టెంబర్ 1, 2019 నుంచి అమలులోకి తీసుకురానున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ సదరు నిబంధనలపై అవగాహన కలిగేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు  కొత్త ట్రాఫిక్ నిబంధనల ప్రకారం రూల్స్ ఉల్లంఘించిన వారికి భారీ పెనాల్టీ , జరిమానా విధించేలా  ప్రత్యేకంగా చట్టాన్ని సవరించినట్లు అధికారులు చెపుతున్నారు. . ఈ సవరించిన చట్టం ప్రకారం… అత్యవసర వాహనాలు( అంబులెన్స్ లాంటివి) లకు మార్గం ఇవ్వకుండా రోడ్డుకి అడ్డంగా వాహనాలను ఆపితే.. వారికి రూ.10వేల జరిమానా విధించే అవకాశం ఉందని హెచ్చరించారు. 


అర్హత లేని వ్యక్తి  డ్రైవర్ గా  వాహనం నడిపితే  రూ.పదివేల జరిమానా విధిస్తారు. కాగా  ఇప్పటి వరకు కొన్ని ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘిస్తే.. కేవలం రూ.100 జరిమానా ఉండగా దానిని   రూ.500 ఫైన్ గా మార్చారు. పొరపాటున వాహనం లైసెన్స్ ఇంట్లో మర్చిపోయి మీరు వెహికిల్ తో రోడ్డు మీదకు వచ్చారో రూ.5వేల జరిమానా చెల్లించాల్సి ఉంటుంది.  ఇన్సూరెన్స్ కాపీ లేకుండా డ్రైవింగ్ చేస్తే రూ.2వేలు జరిమానా,  కారులో వెళ్తూ సీటు బెల్టు పెట్టుకోకుంటే రూ.వెయ్యి , మద్యం సేవించి పట్టుపడితే మాత్రం రూ.పది వేల వరకు చెల్లించాలి.హెల్మెట్ లేకుండా ప్రయాణం చేసినా రూ.వెయ్యి , మితిమీరిన వేగంతో ప్రయాణిస్తే… రూ.1000 నుంచి రూ.2వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది.


 

Latest News

 
ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీరు అందిస్తాం Sat, May 04, 2024, 11:44 AM
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM
సినిమా స్క్రిప్టు ప్రసంగాలకు జనం నవ్వుకుంటున్నారు Sat, May 04, 2024, 10:45 AM
వాలంటీర్స్ ద్వారా పెన్షన్ ఇవ్వొద్దని టీడీపీనేతలు చెప్పింది నిజం కాదా..? Sat, May 04, 2024, 10:44 AM
వాలంటీర్ వ్యవస్థని చంద్రబాబు కావాలనే తప్పించారు Sat, May 04, 2024, 10:42 AM