అత్తి వరదరాజస్వామికి హుండీ ఆదాయం 9.90 కోట్లు

by సూర్య | Thu, Aug 22, 2019, 09:39 AM

కాంచీపురం వరదరాజ పెరుమాళ్‌ ఆలయంలో నిర్వహించిన అత్తి వరదర్‌ ఉత్సవాల సంద ర్భంగా రూ.9.90 కోట్ల హుండీ కానుకలు వచ్చాయ ని జిల్లా కలెక్టరు పొన్నయ్య తెలిపారు. ఈ మేరకు ఆయన బుధవారం విడుదల చేసిన ప్రకటన లో… ఈ ఆలయంలో జులై ఒకటి నుంచి ఈ నెల 17వ తేదీ వరకు అత్తి వరదర్‌ ఉత్సవాల ను ఘనంగా నిర్వహించామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా భక్తులు స్వామి వారికి కానుకలను చెల్లించు కోవడానికి వీలుగా ఆలయ ప్రాంగణంలో దేవాదాయ శాఖ తరఫున 18 హుండీలను ఉంచామని తెలిపారు. వీటిల్లో 13 హుండీలలోని కానుకలను మాత్రమే లెక్కించా రని వెల్లడించారు. తద్వారా రూ.9.90 కోట్ల నగదు, 164 గ్రాముల బంగారం, 4,959 గ్రాముల వెండి కానుకలు వచ్చినట్లు చెప్పారు. మిగిలిన హుండీ ల కానుకలను లెక్కించాల్సి ఉందని తెలిపారు.  

Latest News

 
రాష్ట్రంలో అభివృద్ధి పాతాళానికి దిగజారి పోయింది Wed, May 01, 2024, 06:43 PM
పవన్ కి మద్దతుగా హీరో వైష్ణవ్‌ తేజ్‌ ప్రచారం Wed, May 01, 2024, 06:42 PM
నేడు విశాఖ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్ Wed, May 01, 2024, 06:41 PM
నన్ను గెలిపిస్తే ప్రత్యేక హోదా సాధిస్తా Wed, May 01, 2024, 06:40 PM
మతాల మధ్య చిచ్చు పెట్టాలని బీజేపీ చూస్తుంది Wed, May 01, 2024, 06:39 PM