సీబీఐ కోర్టులో చిదంబరం

by సూర్య | Thu, Aug 22, 2019, 09:43 AM

బుధవారం రాత్రి హైడ్రామా మధ్య సీబీఐ ఐఎన్ఎక్స్ మీడియా కేసులో కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పి. చిదంబరంను అరెస్టు చేసింది. ఆయనను అదుపులోకి తీసుకునే క్రమంలో సీబీఐ అధికారులు ఏకంగా ఢిల్లీలోని ఆయన ఇంటి గోడ దూకి మరీ వెళ్లారు. అరెస్ట్ చేసిన తర్వాత రాత్రంతా సీబీఐ కార్యాలయం లోనే ఉంచారు. ఇవాళ ఆయన్ను సీబీఐ కోర్టులో హాజరుపర్చను న్నారు. అయితే ముందస్తు బెయిల్ కోసం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు చిదంబరం. కానీ అది శుక్రవారం విచారణకు రానుంది. ఇవాళ కోర్టులో విచారణ కోసం తమకు కస్టడీకి అనుమతి ఇవ్వాలని  సీబీఐ కోరిన పక్షంలో 14 రోజులు కస్టడీకి ఇచ్చే అవకాశాలున్నాయి. మరోవైపు సీబీఐ తర్వాత ఈడీ కూడా విచారణకు రెడీగా ఉంది. ఐఎన్ఎక్స్ మీడియాకు అక్రమ మార్గంలో విదేశాలనుంచి భారీగా నిధులు రావడంపై మనీలాండరింగ్ కేసులో ఆయనను ఈడీ ప్రశ్నించనుంది. ఇలా ఒకరి తర్వాత మరొకరు చిదంబరం ను కస్టడీకి తీసుకుంటే ఆయన ఇప్పట్లో బయటకు వచ్చే అవకాశాలు కనిపించడం లేదు.


ఇదిలా ఉంటే ఐఎన్ఎక్స్ మీడియా కేసులో తనకేమీ సంబంధం లేదని, కేంద్ర ప్రభుత్వం తమపై కక్షగట్టి ఇలా కేసుల్లో ఇరికిస్తుందని చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం ఆరోపిస్తున్నారు. తన తండ్రికి ఈ కేసులో ఎలాంటి ప్రమేయం లేదని తెలిపారు.



Latest News

 
ఈనెలలో రాష్ట్రానికి రానున్న ప్రధాని Thu, May 02, 2024, 08:54 PM
హోం ఓటింగ్ ప్రక్రియ ఈరోజు నుంచే ప్రారంభమైంది Thu, May 02, 2024, 08:53 PM
లేనిపోని అబాండాలు మోపడం ఎందుకు? Thu, May 02, 2024, 08:52 PM
నియోజకవర్గంలోని సమస్యలన్నీ పరిష్కరిస్తా Thu, May 02, 2024, 08:52 PM
వాతావరణ అప్ డేట్స్ Thu, May 02, 2024, 08:51 PM