ర్యాగింగ్ మాటున 150 మందికి గుండుకొట్టి

by సూర్య | Wed, Aug 21, 2019, 11:42 PM

సీనియర్‌ విద్యార్థులు  రాగింగ్ కి 150 మంది జూనియర్‌ విద్యార్థులు బలయ్యారు. ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ని ఓ మెడికల్‌ కాలేజీలో  జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగు చూసింది.  వివరాల్లోకి వెళితే సఫాయిలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీలో ఇటీవలే 150 మంది విద్యార్థులు ప్రవేశం పొందారు. వీరి పట్ల సీనియర్లు దారుణంగా ప్రవర్తించారు. ర్యాగింగ్‌ పేరిట జూనియర్లందరికీ గుండ్లు గీయించారు. అంతటితో ఆగకుండా వారిని కాలేజీ క్యాంపస్‌లో తిప్పుతూ.. నమస్కారం చేయించుకుని వీడియోలు తీసి సోషల్ మీడియాలో పెట్టారు. దీంతో ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. 


ఈ ఘటనపై యూనివర్సిటీ వైన్స్‌ ఛాన్స్‌లర్‌ డాక్టర్‌ రాజ్‌కుమార్‌ స్పందించారు. ఇప్పటికే కాలేజీలో యాంటీ ర్యాగింగ్‌ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ఈ కమిటీ నివేదిక ప్రకారం సీనియర్లపై ఖచ్చితంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. జూనియర్లు.. యాంటీ ర్యాగింగ్‌ కమిటీకి లేదా సంబంధిత వార్డెన్లకు ఫిర్యాదు చేయొచ్చు అని వీసీ సూచించారు.  


 

Latest News

 
200 కుటుంబాలు టిడిపిలో చేరిక Sat, May 04, 2024, 12:28 PM
విజయవాడ కనకదుర్గ గుడిలో అధికారి రాసలీలలు Sat, May 04, 2024, 12:10 PM
కమలాపురం పరిధిలో ఏపీఎస్పీ బలగాలతో పోలీసుల కవాతు Sat, May 04, 2024, 12:09 PM
ఎమ్మెల్యేగా గెలిస్తే సాగు, తాగునీరు అందిస్తాం Sat, May 04, 2024, 11:44 AM
నేడు హిందూపురంలో పర్యటించనున్న సీఎం జగన్ Sat, May 04, 2024, 10:45 AM